నిఘా సంస్థలపై వికీలీక్స్ అసాంజే
మన వద్ద ఐఫోన్, బ్లాక్‌బెర్రీ లేదా మరే ఇతర మొబైల్ ఫోన్ వున్నా సరే మనం నిఘా కంటిలో పడ్డట్లేనంటున్నారు వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే. గురువారం ఇక్కడి సిటీ యూనివర్శిటీ హాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ మన కదలికలను అనుక్షణం గమనించే 'పెద్దన్న'లున్నారు జాగ్రత్త అంటూ ప్రజలను హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ప్రజల కదలికలపై నిఘా వుంచుతూ, ఎటువంటి నియమ నిబంధనలూ లేకుండా పనిచేస్తూ, ఏటా వందల కోట్ల డాలర్లు ఆర్జిస్తున్న ఈ నిఘా రంగానికి సంబంధించిన దాదాపు 287 ఫైల్స్‌ను, అత్యంత అరుదైన పత్రాలను ఆయన విడుదల చేశారు. దాదాపు 25 దేశాలకు సంబంధించిన ఈ నిఘా సమాచారం వికీలీక్స్ సిద్ధం చేసుకున్న పత్రాల శ్రేణిలో మొదటి భాగం మాత్రమే. ఈ పత్రాలతో కూడిన సమాచారాన్ని త్వరలో బహిర్గతం చేసేందుకు వికీలీక్స్ రంగం సిద్ధం చేసిందని ఆయన చెప్పారు. 9/11 దాడుల అనంతరం డాలర్ల పంట పండిస్తున్న ఈ నిఘా పరిశ్రమ గుట్టును రట్టు చేసేందుకు తాము బగ్గ్‌డ్ ప్లానెట్, ప్రైవసీ ఇంటర్నేషనల్ అనే సంస్థలతో పాటు భారత్‌లోని 'ది హిందూ' సహా ఆరు దేశాల్లోని మీడియా సంస్థలతో కలిసి పనిచేశామని అసాంజే వివరించారు. ఇందుకు సంబంధించిన 287 పత్రాలను ప్రస్తుతం తాము విడుదల చేస్తున్నామని, ఈ స్పై ఫైల్స్ ప్రాజెక్టు ఇకపై కూడా కొనసాగుతుందని, మరింత సమాచారాన్ని వచ్చే వారం నుండి వచ్చే ఏడాది వరకూ క్రమంగా విడుదల చేస్తామని ఆయన చెప్పారు.
ప్రజలపై నిఘా వుంచటం మనం హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే చూస్తుంటా మని, అయితే పశ్చిమ దేశాలకు చెందిన కొందరు 'ఇంటెలిజెన్స్ కాంట్రాక్టర్లు' ఈ రంగంలో పాతుకుపోయిన మాట వాస్తవ మని అసాంజే వివరించారు. గత దశాబ్ద కాలంలో ఈ నిఘా పరిశ్రమ కోవర్ట్ ఆపరేషన్ల స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయిలో భారీ వ్యాపారంగా ఎదిగింద న్నారు. ఈ రంగంతో పొంచివున్న ముప్పును ఆయన నాటకీయ పద్ధతిలో వివరిస్తూ మనలో ఎవరి వద్ద అయినా మొబైల్ ఫోన్ వంటి పరికరం వుంటే మనల్ని మనం నిఘా సంస్థల చేతుల్లో పెట్టుకున్నట్లేనన్నారు. ఇటువంటి కొత్త కోవర్ట్ నిఘా పద్ధతులతో పరిశోధనాత్మక జర్నలిజానికి తీవ్ర ముప్పు పొంచివుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్, వాటి అనుబంధ సంస్థల హ్యాకింగ్‌కు గురైన తమ వెబ్‌సైట్‌ను మరింత సురక్షితంగా రూపొందించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు వికీలీక్స్ వ్యవస్థాపకుడు వివరించారు. అంతర్జాతీయంగా వున్న ఈ నిఘా సంస్థలు తమ వద్ద వున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరికరాలను ప్రపంచంలో ప్రతి దేశానికీ విక్రయిస్తున్నాయన్నారు. టెలికమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ల సహాయం, సమ్మతి లేకుండానే ఇంటెలిజెన్స్ సంస్థలు, సైనిక దళాలు, పోలీసు అధికారులు చాపకింద నీరులా మీ కాల్స్‌ను, మీ కంప్యూటర్స్‌ను ఛేదించి రహస్య సమాచారాన్ని తెలుసుకునే ప్రమాదం పొంచివుందని ఆయన హెచ్చరించారు. ప్రపంచంలోని ప్రతిఒక్కరి మీదా పెద్దన్నల నిఘా నేత్రం వుందని, ప్రపంచంలోని ఏ ఒక్క ప్రాంతమూ, ఏ ఒక్కరూ సురక్షితమైన పరిస్థితుల్లో లేరని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
వీడియో లింక్ ద్వారా ఈ కార్యక్రమంలో ప్రసంగించిన 'ది హిందూ' పత్రిక ప్రధాన సంపాదకుడు ఎన్ రామ్ భారత్‌లో సైతం అడ్డూ అదుపూ లేకుండా ఈ నిఘా పరిశ్రమ ఎదుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎటువంటి చట్ట నిబంధనలను పట్టించుకోకుండా కనీసం రెండు కంపెనీలు ఈ నిఘా సాంకేతిక పరిజ్ఞానాన్ని విక్రయిస్తున్నాయని ఆయన చెప్పారు. మన వ్యక్తిగత విషయాల్లోకి మరొకరు చొచ్చుకురావటం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ఆయన అన్నారు.
వికీలీక్స్‌తో కలిసి పనిచేయటం తమకు అత్యంత అమూల్యమైన అనుభవాన్ని మిగిల్చిందని రామ్ చెప్పారు. ప్రస్తుతం వికీలీక్స్ విడుదల చేస్తున్న పత్రాలకు సంబంధించిన అంశం అంతర్జాతీయంగానూ, భారత్‌లోనూ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందని అభిప్రాయపడ్డారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి