11, డిసెంబర్ 2011, ఆదివారం

యాహూ’లోనూ ‘అన్నా’ ప్రభంజనం

అవినీతిపై అవిశ్రాంతంగా ఉద్యమిస్తున్న అన్నాహజారే సామాజిక వెబ్‌సైట్లనూ ప్రభావితం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరో ఘనతనూ సొంతం చేసుకున్నారు. భారత్‌లో యాహూ వెబ్‌సైట్‌లోనూ నెటిజన్లు అత్యధికంగా చర్చిస్తున్న అంశం అన్నాహజారే ఉద్యమంపైనే కావడం గమనార్హం. 

భారత్‌లో 2011కు సంబంధించి యాహూలో అధికులు ఏ విశయాన్ని ప్రస్తావించారన్న అంశంపై వెబ్‌సైట్ నిర్వాహకులు జరిపిన ఓ సర్వేలో ఈ విశయం వెల్లడైంది. సాధారణంగా గ్లామర్ రంగంలోని ప్రముఖులు ఇలాంటి సర్వేల్లో అగ్రభాగాన నిలుస్తుంటారు కానీ వారి స్థానంలో అన్నాహజారే మొదటి స్థానం పొందడం విశేషం. దేశంలో పెరుగుతున్న అవినీతి నిరోధానికి లోకపాల్ బిల్లును కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో హజారే అవిశ్రాంతంగా 288 గంటల పాటు చేసిన నిరాహార దీక్షతో ఆయన పాపులారిటీ అమాంతం పెరిగినట్టు వెబ్‌సైట్ వెల్లడించింది. 

అలాగే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ వంటివారితో పాటు బాలీవుడ్ ప్రముఖుల గురించి, వారి వ్యక్తిగత జీవితాలు గురించి నెటిజన్లు అధికంగా చర్చించుకున్నారని వెబ్‌సైట్ తెలిపింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి