మహేష్ బాబు కెరీర్లో తొలిసారిగా 'బిజినెస్ మేన్' సినిమా షూటింగు అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పూర్తయింది. ప్యాచ్ వర్క్ సహా డిసెంబర్ 10 షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఆఖరి సీన్లను చిత్రీకరించారు. కేవలం 74 రోజుల్లో 84,000 అడుగుల ఎక్స్ పోజర్ తో షూటింగు పూర్తి చేశామని దర్శకుడు పూరీ జగన్నాథ్ చెబుతున్నారు. హీరో మహేష్ ఈ సినిమా కోసం 65 రోజులు వర్క్ చేశారని ఆయన తెలిపారు. హీరోయిన్ కాజల్ 30 రోజులు షూటింగ్ చేసిందన్నారు. అందరి సహకారంతో ఇంత పెద్ద సినిమాని రికార్డు టైంలో కంప్లీట్ చేయగలిగామని దర్శకుడు చెప్పారు.
'ఈ సినిమాలో మహేష్ పేరు సూర్య. హీరోయిజంని పీక్ లెవెల్ కి తీసుకువెళ్లే సూర్య పాత్రను మహేష్ అద్భుతంగా చేశారు. మహేష్, కాజల్ పై తీసిన పాటలు సూపర్బ్ గా వచ్చాయి. ఫస్ట్ టీజర్ తో బాటు, మొన్న రిలీజ్ చేసిన సెకండ్ టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు' అన్నారు పూరిజగన్నాథ్. ఈ నెల 22న ఆడియోను, జనవరి 11న సినిమాను విడుదల చేస్తామని చెప్పారు. ఆడియో వేడుక శిల్పకళావేదికలో జరగనుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ పొందింది
11, డిసెంబర్ 2011, ఆదివారం
74 రోజుల్లో పూర్తయిన 'బిజినెస్ మ్యాన్'..!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి