1, డిసెంబర్ 2011, గురువారం

స్టాలిన్ అరెస్టు....................?

డిఎంకె నేత ఎంకె స్టాలిన్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. డి యం కె నార్త్ తమిళనాడు కి కింగ్ గత ప్రబుత్వం లో పేరుకి కరుణ సియం అయిన అన్ని తానై నడిపించాడు స్టాలిన్ చెన్నై లో ఎక్కడ చూసిన స్టాలిన్ ఫ్లెక్షిలే కనిపించేవి. అన్నాడియంకె వచ్చిన తరువాత అంతా తారుమారు అయ్యింది . చెన్నై లో అత్యంత ప్రధానమైన ప్రాంతంలో ఉన్న విలువైన భూములను అమ్మాలని బెదిరించారనే ఆరోపణలపై స్టాలిన్, ఆయనకు కుమారుడు ఉదయనిధిలపైన, మరో నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎన్ఎస్ కుమార్ అనే వ్యక్తి నవంబర్ 29వ తేదీన చేసిన ఫిర్యాదు మేరకు ఆ ఎఫ్ఐఆర్ నమోదైంది. తెయినాంపేటలోని చిత్తరంజన్ దాస్ రోడ్డులో గల తన భూమిని అమ్మాలని స్టాలిన్ అనుచరులు తనను బెదిరించారని అతను ఫిర్యాదు చేశాడు.

తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని స్టాలిన్ ఖండించారు. తప్పు సమాచార నివేదిక ఆధారంగా తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆయన విమర్శించారు. వాయిదా కోరకుండా న్యాయంగా దాన్ని ఎదుర్కుంటానని ఆయన చెప్పారు. అత్యంత విలువైన భూమిని రూ .5.54 కోట్ల రూపాయలకే విక్రయించాలని స్టాలిన్ అనుచరులు బెదిరించారని కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు .ఆ ఫిర్యాదు మేరకు స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి, పి. వేణుగోపాల్ రెడ్డి, రాజా శంకర్, సుబ్బారెడ్డి, శ్రీనివాస్‌లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జయలలిత ప్రభుత్వం వచ్చిన తర్వాత భూకబ్జా కేసులను ప్రత్యేకంగా పరిశీలిస్తూ డిఎంకె నాయకులను ఒక్కరొక్కరినే అరెస్టు చేసుకుంటూ పోతోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి