6, డిసెంబర్ 2011, మంగళవారం

రొటీన్‌ లవ్‌స్టోరీ

ప్రస్థానం ఫేమ్‌ సందీప్‌, రెజీనా జంటగా ఫేమ్‌ ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రొటీన్‌ లవ్‌స్టోరీ'. ఎ వర్కింగ్‌ డ్రీమ్‌ ప్రొడక్షన్స్‌, బెంచ్‌మార్క్‌ మూవీస్‌ సంయుక్త నిర్మాణంలో చాణక్య బూనేటి, పి. మణికుమార్‌ కలిసి నిర్మిస్తున్నారు. దర్శకుడు చిత్రం గురించి చెబుతూ...'ఈ ప్రపంచంలో దేనికైనా నిర్వచనాలు చెప్పవచ్చు. కానీ ప్రేమకు మాత్రం సరైన నిర్వచనం లేదు. ఒక్కొక్కరూ ఒక్కోలా చెబుతుంటారు. ప్రేమ లక్ష్యమూ లక్షణమూ రొటీన్‌గానే అనిపిస్తాయి. కానీ, ఆయా మానసిక స్థితుల్నిబట్టి మిగతావారికన్నా తమ ప్రేమ డిఫరెంట్‌ అనే ఫీలింగ్‌ కలుగుతుంది. చాలా సహజమైన ప్రేమకథను ఎలాంటి కల్తీలేకుండా ఇందులో ఆవిష్కరిస్తున్నాం. అలాగని ఇందులో సందేశాలు ఉండవు. అంతా వినోదమే' అని చెప్పారు. అక్టోబర్‌ 31న చిత్రీకరణ ప్రారంభించాం. ఈనెల 3తో షెడ్యూల్‌ పూర్తయింది. రెండోవారంలో నార్త్‌ ఇండియాలో మరో షెడ్యూల్‌ మొదలవుతుంది. 25రోజులుపాటు విభిన్న లొకేషన్లలో చిత్రీకరణ చేస్తాం' అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్‌, కెమెరా: సురేష్‌, ఛోటా కె నాయుడు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: అర్చన బూనేటి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి