‘‘ఆత్మ విశ్వాసం ఉన్న కొందరి చరిత్రే ప్రపంచ చరిత్ర. ఉక్కు కండరాలు, ఇనుప నరాలు, వజ్ర సంకల్పం కలిగిన యువకులు కావాలి మన దేశానికి’’, ‘‘లక్ష్యం ఉన్నతంగా ఉండాలి. దాని కోసమే కృషి చెయ్యాలి. సముద్రాన్ని చూడండి.. అలలను కాదు’’.. అంటూ యువతరాన్ని జాగృతం చేసిన మహనీయుడు స్వామి వివేకానంద. ఆయన చనిపోయి 110 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆయన బోధనలు యువతరానికి స్ఫూర్తిదాయకాలు.
అంతర్జాతీయ వేదికలపై హిందూ మతప్రాశస్త్యాన్ని చాటి చెప్పిన ఈ ఆధ్యాత్మిక నాయకుని జీవితం వెండితెరకు ఎక్కబోతోంది. ఈ బృహత్తర ప్రయత్నం చేస్తున్నది ఎవరో కాదు... వెంకటేష్. పాతికేళ్లుగా గ్లామర్ ప్రపంచంలో ఉంటూ కూడా తనకంటూ ఓ ఆధ్యాత్మిక లోకాన్ని సృష్టించుకున్న వెంకటేష్ త్వరలో వివేకానందుని పాత్ర పోషించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అందుకు సంబంధించి గత కొంతకాలంగా కసరత్తులు కూడా జరుగుతున్నాయి. 2012 ద్వితీయార్ధంలో ఈ చిత్రం మొదలుకానుంది.
బాలీవుడ్‌లో స్థిరపడిన మన తెలుగువాడు మణిశంకర్ ఈ వివేకానందను తీర్చిదిద్దబోతున్నారు. ఇప్పటికే స్క్రిప్టు వర్కు దాదాపుగా పూర్తయింది. ఈ ప్రాజెక్టు విషయంలో వెంకటేష్ చాలా ఆసక్తిగా ఉన్నారు. ‘‘వివేకానందుడంటే సాదాసీదా వ్యక్తి కాదు. ఓ డైనమైట్ ఆయన. ప్రపంచాన్ని జాగృతం చేసే శక్తిసామర్థ్యాలు కలిగినవాడు. ఆయన చెప్పిన ప్రతి వాక్యం మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది. నేను ఆయనను బాగా ఆరాధిస్తాను. మన మూడ్స్‌ని నాలుగ్గోడల మధ్యనే వదిలేయాలి కానీ, వాటితో ఈ అందమైన ప్రపంచాన్ని కలుషితం చేయొద్దని వివేకానందుని చెప్పిన బోధనను నేనెప్పటికీ మరచిపోలేను’’ అంటూ వెంకటేష్ చెప్పుకొచ్చారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి