వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదని, ఈ వృత్తిలో తాము కొనసాగలేమంటూ దేశంలో 42 శాతం రైతులు అభిప్రాయపడుతున్నారని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తెలిపారు. పానిపట్‌లో ఆలిండియా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరుగనున్న రెండు రోజుల సదస్సును ఆయన శనివారం ప్రారంభించారు.
గత పదేళ్లలో 2.25 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రైతుల దుస్థితి ప్రస్తుతం దారుణంగా మారిందన్నారు. కేవలం సంవత్సర కాలంలోనే 50 కేజీల డీఏపీ ధర రూ.420 నుంచి రూ.వెయ్యి రూపాయలకు పెరిగిందని గుర్తు చేశారు. పంటల బీమా కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే తప్ప రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు కాదని, రైతులకు వ్యవసాయ రాబడి పథకం కావాలని సూచించారు.
ఎలాంటి పండలు పండిస్తున్న రైతులైనా మద్దతు ధర లభించక తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారని, ప్రభుత్వం స్వయంగా ప్రకటించే కనీస మద్దతు ధరను కూడా రైతులకు ఇవ్వలేకపోతోందని విమర్శించారు. రైతుల పట్ల ప్రణాళికా సంఘం, పార్లమెంటు, పార్టీలు, పత్రికల దృక్పథం మారాల్సి ఉందని సూచించారు. రైతుల పెట్టుబడికి 50 శాతం అదనంగా మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. జమ్మూ, కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు, బీజేపీ నాయకులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
10, డిసెంబర్ 2011, శనివారం
వ్యవసాయం వద్దంటున్న రైతులు: వెంకయ్య
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి