8, డిసెంబర్ 2011, గురువారం

బొత్సాకు సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదు

 వోక్స్ వ్యాగన్ కుంభకోణం కేసులో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు సీబీఐ క్లీన్‑చిట్ ఇవ్వలేదని టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. అందుకు సంబంధించిన రికార్డులను బయటపెడతామని ఆయన గురువారం ఇక్కడ అన్నారు.సీబీఐ పూర్తిగా సోనియాగాంధీ కనుసన్నల్లో నడుస్తోందని గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. అవినీతి ఆరోపణల్లో రాజాను అరెస్ట్ చేసి వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంమంత్రి చిదంబరం, రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిలను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి