ఇండోర్‌లో జరుగుతున్న నాలుగవ వన్డేలో నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి 418 పరుగుల భారీ స్కోరును వెస్టిండీస్ జట్టు ముందుంచింది. వన్డేల్లో భారత్‌కు ఇదే అత్యుత్తమ స్కోరు. సెహ్వాగ్ క్రీజులో ఉన్నాడంటే... పరుగులు వరదలా పారడం సహజం. అయితే ఈ మ్యాచ్‌లో సెహ్వాగ్ రికార్డుల వరద ప్రవాహాన్ని ఆపడం ఎవరి సాధ్యం కాలేదు. సెహ్వాగ్ బ్యాటింగ్ ధాటికి విండీస్ ఆటగాళ్లు విలవిలలాడారు. వీరేంద్రుని బ్యాటింగ్ జోరుకు విండీస్ ఆటగాళ్లు ప్రేక్షకుల్లా మారారంటే ఆశ్చర్యం ఏమి లేదు. ఈ మ్యాచ్‌తో వన్డేల్లో సెహ్వాగ్ 8 వేల పరుగుల క్లబ్ చేరాడు. వన్డేలో సచిన్ పేరిట వున్న డబుల్ సెంచరీ రికార్డును 140 బంతుల్లోనే తిరగరాశాడు.
8, డిసెంబర్ 2011, గురువారం
సెహ్వాగ్ శివతాండవం, విండీస్ లక్ష్యం 419
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి