రంగంలోకి దిగిన జగన్….
జగన్ పూర్తిగా రంగంలోకి దిగారు. తనకు మద్దతినిచ్చే ఎమ్మెల్యేలతో అమితుమీ తేల్చుకోనున్నారు. ఎవరిని బతిమాలేది లేదని, తనమై నమ్మకముంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలని, లేకుంటే వెళ్లిపోవాలని నేరుగా చెప్పారు. అంతేకాకుండా చిత్తశుద్ధి ఉంటే తనపై నమ్మకముంచాలని కూడా చెప్పారు. 21 మంది ఎమ్మెల్యేలలో కుంజా సత్యవతి మినహా అందరూ అవిశ్వాసానికి మద్దతిస్తామని ప్రకటించారు. కుంజా సత్యవతి మాత్రం వైఎస్ ఏర్పరచిన ప్రభుత్వాన్ని తాను కూల్చి వేయలేనని, అవిశ్వాసాన్ని తాను వ్యతిరేకస్తానని చెప్పారు.
అయితే మరో వైపు జగన్ మరికొందరు ఎమ్మెల్యేలకు ఎర వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టిడిపి, పిఆర్పీ ఎమ్మెల్యేలను తన వర్గంలోకి చేర్చుకోవాలని జగన్ యోచిస్తున్నట్లు సమాచారం. అందుకోసం క్యారీబ్యాగ్‌లు కూడా కొన్ని వెళ్లినట్లు తెలుస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనైనా కాంగ్రెస్ సర్కార్‌ను కూలదోయాలని జగన్ భావిస్తున్నారు. అయితే అది సాధ్యమా కదా? అన్నది తేలాల్సి ఉంది.
పీఆర్పీ హైడ్రామా….
మరోవైపు ప్రజారాజ్యం పార్టీ హైడ్రామా నడిపింది. చిరంజీవి అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో ముచ్చటించారు. కాంగ్రెస్ వైఖరి పట్ల పీఆర్పీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, తమను థర్డ్ గ్రేడ్ పర్సన్స్‌గా పార్టీలో చూస్తున్నారన్నది చిరు ఆరోపణ. ఇందుకోసం రేపు పీఆర్పీఎల్‌సీ అత్యవసర భేటీ కానుంది. అవిశ్వాసంపై ఏమి చేయాలన్నది ఈ సమావేశంలో నిర్ణయిస్తారు. పీఆర్పీ విలీనం జరిగనప్పటి నుంచి కాంగ్రెస్ తమను పెద్దగా పట్టించుకోవడం లేదన్నది చిరు టీమ్ ఆరోపణ. ప్రధానంగా మంత్రి వర్గ విస్తరణలో తమకు అవకాశం కల్పించలేదన్నది వారి బాధ. మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో జరిగేలా లేదు. దీంతో చిరు కిరణ్‌కు చిన్న ఝలక్ ఇచ్చారు. దీనిపై రేపు సిఎం కసరత్తు చేయనున్నారు.
సొంత ఇంట్లో…
ఇంకోవైపు మాజీ మంత్రులు జేసీ దివాకర్ రెడ్డి, గాదె వెంకటరెడ్డిలు సీఎంతో భేటీ అయ్యారు. మంత్రి వర్గంలో తమకు స్థానం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇద్దరూ సీనియర్లే. వైఎస్ మరణం తర్వాత వారికి మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. అలాగే కిరణ్ సర్కారుకు మద్దతిచ్చేందుకు తెలంగాణాలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మరికొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మంత్రులు కూడా అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా శంకర్రావు, బొత్స సత్యానారాయణ తదితరులు సిఎం పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. దీంతో అవిశ్వాస తీర్మానంపై సిఎం బ్యాచ్ కంగారులో ఉన్నారు. మొత్తం మీద అవిశ్వాస తీర్మానం కిరణ్‌కు నిద్ర పట్టనివ్వడం లేదు. సోమవారం ఏం జరగనుందో వేచి చూడాల్సిందే.
మొత్తానికి సేఫ్ గేమ్ ఆడదామని ప్రతిపక్షం సాయం తీసుకోవడానికి కాంగ్రెస్ చేసిన యత్నంలో భాగంగా తన తీసుకున్న గోతిలో తనే పడే పరిస్థితి వచ్చింది. రహస్య ఓటింగు కనుక జరిపితే ప్రభుత్వం కూలడానికి 99 అవకాశాలున్నాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి