3, డిసెంబర్ 2011, శనివారం

హిట్ దిశగా శ్రీరామరాజ్యం

బాలకృష్ణ, నయనతార జంటగా బాపు రూపొందించిన రమణీయ దృశ్య కావ్యం 'శ్రీరామ రాజ్యం' బాలకృష్ణ కెరీర్ లోనే ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోయే చిత్రంగా అందరి ప్రశంసలు అందుకుంటున్న ‘శ్రీరామ రాజ్యం’ కలెక్షన్స్ నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. నవంబర్ 17 చిత్రం విడుదలై మూడో వారంలోకి ఎంటర్ అయిన ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లో ఆదరణ పెరుగుతున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. పబ్లిక్ టాక్ పాజిటివ్ గా రావడం వల్లే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తున్నారు. కొన్ని ఏరియాల్లోని థియేటర్లలో శ్రీరాముడి విగ్రహాల్ని ఏర్పాటు చేసి పూజలు కూడా జరిపిస్తున్నారు. దాంతో థియేటర్లన్నీ దేవాలయాలుగా మారిపోతున్నాయి.

ఈ సినిమాలో సీత పాత్రను నయనతార పోషించగా, వాల్మీకి మహర్షి పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మణుడి పాత్రలో శ్రీకాంత్ నటించారు. ఇళయరాజ సంగీతం అందించారు. బాపు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రమణ రచయితగా పని చేశారు. బాపు-రమణ సినిమా కావడం, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాలయ్య హీరో కావడంతో సాధారణంగానే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా సినిమా ఉండటంతో సినిమా విజయం దిశగా సాగుతోంది.

గుంటూరు జిల్లాలో ‘శ్రీరామ రాజ్యం’ రథాన్ని ప్రచారం కోసం వాడుతున్నారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని డిస్ట్రిబ్యూటర్లు ఆనందంగా చెప్తున్నారు. సినిమా బాగుందన్న టాక్ వున్నప్పటికీ మొదటి వారం 50శాతం కూడా కలెక్షన్స్ లేకపోవడంతో కంగారు పడ్డ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ హౌస్ ఫుల్స్ వైపు దూసుకెళ్తున్న ‘శ్రీరామ రాజ్యం’ రేంజ్ ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
అన్నమయ్య కూడా ఐదో వారం నుంచే బాగా వసూళ్ళు రాబట్టింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి