8, డిసెంబర్ 2011, గురువారం

విజయవాడలో ఫ్లెక్సీల వివాదం

* మహేష్‌బాబు, ఎన్టీయార్‌ పై విమర్శలతో ఫ్లెక్సీలు

* పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌పై పోలీసుల ఆగ్రహం

* అరెస్టు హెచ్చరికలతో దిగొచ్చిన ఫ్యాన్స్‌

* థియేటర్ల దగ్గర ఫ్లెక్సీల తొలగింపు

 

విజయవాడలో పంజా ఫెక్సీలు దుమారం రేపుతున్నాయి. మహేష్‌బాబు, జూనియర్‌ ఎన్టీయార్‌ పై విమర్శలు గుప్పిస్తూ... థియేటర్ల దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదాలకు కారణమవుతోంది. దీనిపై ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ గొడవలు పడుతున్నారు. ఈ వివాదంపై అప్రమత్తమైన పోలీసులు.. ఫ్లెక్సీలను తొలగించే పనిలో పడ్డారు. అలాగే వివాదానికి కారణమైన పవన్‌ కళ్యాణ్‌ అభిమానులను అరెస్ట్ చేస్తామని హెచ్చరించడంతో... వారు దారికొస్తున్నారు. తమంతట తామే ఆ ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి