8, డిసెంబర్ 2011, గురువారం

నాది విచక్షణ ఓటు

అవిశ్వాసంలో ఓటింగ్‌కు గైర్హాజరుపై జేపీ

ఆ ఓటు కాంగ్రెస్, టీడీపీలకు వ్యతిరేకం

ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన ఆవిశ్వాసం సందర్భంగా ఓటింగ్‌కు హాజరు కాకుండా తాను 'విచక్షణ ఓటు' వేశానని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు ఎన్.జయప్రకాశ్ నారాయణ చెప్పారు. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్, ఏదో రకంగా గద్దెనెక్కాలని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని జేపీ డిమాండ్ చేశారు. గురువారం బంజారాహిల్స్‌లో లోక్‌సత్తా నూతన కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం జేపీ విలేకరులతో మాట్లాడారు. పజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి చూపించకుండా అధికార, విపక్షాలు ఒకే రీతిన వ్యవహరిస్తున్నందునే వాటికి వ్యతిరేకంగా తాను విచక్షణ ఓటు వేశానని చెప్పారు.' పరిపాలించేందుకు ఒక పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించినప్పుడు ఆ పార్టీ పూర్తి కాలం కొనసాగాలి. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరించే హక్కు కోరుతున్న లోక్‌సత్తా అవిశ్వాసంలో అలాంటి ఓటునే వినియోగించుకుంది' అని అన్నారు. కాంగ్రెస్, టీడీ పీలు రైతుల తరఫున మొసలి కన్నీరు కారుస్తూ వ్యవసాయాన్ని నాశనం చేశాయని ఆరోపించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి