రాష్ట్రంలో ఎక్కడ చూసినా గత వారం రోజులుగా 'పంజా' మేనియా కనిపిస్తోంది. గత కొంతకాలంగా గెలుపోటములు పవర్‌స్టార్‌తో దోబూచులాడుతున్నా వాటితో సంబంధం లేకుండా ఈమధ్యకాలంలో ఏ చిత్రానికీ రానంత హై ఎక్స్‌పెక్టేషన్స్ అభిమానుల్లో రేకెత్తించిన చిత్రం పంజా. ఎందుకింత క్రేజ్ అంటే వచ్చే సమాధానం ఒక్కటే ఆ చిత్రంలో పవన్ డిఫరెంట్ గెటప్. ఇప్పటిదాకా ఎలాంటి ప్రత్యేక గెటప్పులజోలికి వెళ్లని పవన్‌కళ్యాణ్ ఈ చిత్రానికి ఇంత ప్రాముఖ్యత నివ్వడమే ఈ చిత్రం క్రేజ్‌కు ఒక కారణం అని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్‌గా రావడంతో పవన్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు ఇప్పటినుంచే. ప్రపంచవ్యాప్తంగా 1800 సెంటర్లలో దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిదివేల స్క్రీన్‌లపై పంజా చిత్రాన్ని అభిమాన ప్రేక్షకులు వీక్షించనున్నారని సమాచారం.
ఇక సినిమా కనుక ఏ మాత్రం హిట్ రేంజ్ టాక్ తెచ్చుకున్నా గత రికార్డులన్నీ బద్దలవ్వడం ఖాయం అంటున్నారు అభిమానులు. గల్ఫ్ సినీ చరిత్రలో సంచలనం, కనీవినీ ఎరుగనిరీతిలో మొట్టమొదటిసా రిగా 10 ప్రింట్లతో 28 సెంటర్లలో విడుదలవుతున్న చిత్రం 'పంజా'. ఇప్పటికే విడుదలైన పంజా ఆడి యో ఘన విజయం సాధించడంతో మెగా అభిమానులలో పంజా చిత్రం పట్ల విపరీతమైన అంచనాలు భారీగానే వున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలైన దుబాయి, అబుదాబి,షార్జా,మస్కట్,కతార్,సౌదీ,బహ్రైన్,కువైట్ వంటి పలు ప్రాంతాలలో మెగా అభిమానులలో పండుగ వాతావరణం నెలకొంది.
గల్ఫ్ చరిత్రలోనే ప్రప్రధమంగా 28 సెంటర్లలో పంజా విడుదల చెయడం గల్ఫ్ తెలుగు సినీ చరిత్రలో మరో రికార్డుగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రం గల్ఫ్ లో బాలాజీ మూవీస్, దుబాయి వారిద్వారా విదుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ పంజా చిత్రం కథ పవన్‌కళ్యాణ్‌కు సరిపోయే కథ అనీ, ఎప్పటినుంచో ఇలాంటి కథాంశంతో చేయాలని ఎదురుచూశామనీ, అంతర్లీనంగా దేశభక్తి ప్రభోదించే అంశాలు న్నాయనీ, ఇలాంటి చిత్రాన్ని తీయటం చాలా ఆనందంగా ఉందని నిర్మాతలు నీలిమ తిరుమలశెట్టి, శోభుయార్లగడ్డ, నగేష్‌ముంత తెలియజేస్తున్నారు.
ఇప్పటిట్రెండ్‌కు సరిపడే కథాంశం. పంజా అనే టైటిల్ కథలో పవన్ పాత్రకు సరిపోయేట్లుగా ఉంటుంది. చుర చురచూసే చూపు, అతని ప్రవర్తన, అతనిలో ఫైర్ కలిపి ఈ టైటిల్‌కు సరిపోతాయి. ఈ చిత్ర కథ మాఫి యా బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. గ్యాంగ్‌లో పవన్ మెంబర్. అం తర్లీనంగా దేశభక్తి అంశం కూడా ఉంటుంది. పాత్ర పేరు జయదేవ్ షార్ట్‌కట్‌లో జై అంటారు.ప్రతి నాయకులు జాకీష్రాఫ్, అడవి శేషు. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే జనాదరణ పొందాయి. పాపారాయుడు పాట చాలా ఫేమస్ అయింది. చిత్ర రీరికార్డింగ్ హైలైట్‌గా నిలుస్తుంది. చాలా సహ జంగా యాక్షన్ సీన్స్ ఉంటాయి. హిందీ క్రిష్ చిత్రానికి పనిచేసిన శ్యామ్‌కౌశిక్ యాక్షన్ సన్నివేశాలు చేశారన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి