'నేను ఎప్పుడూ డబుల్‌సెంచరీ కోసం కలకనలేదు. ఊహించలేదు కూడా. కొంచెం సేపు ఓపిక చేసుకుని ఆడితే మంచి స్కోరు సాధించవచ్చని క్రీజ్‌లోకి రాగానే గౌతవ్గు గంభీర్‌తో చెప్పాను. అదే విధంగా మేమిద్దరం కూడా నిలదొక్కుకుని ఆడాం. స్వేచ్ఛగా షాట్లుకొట్టగలిగాను. అప్పుడే అనుకున్నాను. ఎక్కువ పరుగులను తీయటానికి ఇదే సరైన సమయమని . బ్యాటింగ్ పవర్‌ప్లే చక్కగా సహకరించింది. అభిమానులు నా నుంచి ఎప్పటినుంచో డబుల్‌సెంచరీ ఆశిస్తున్నారని తెలుసు. వారి అభిమానానికి కృతజ్ఞతలు. నా కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.'
- భారత వన్డే ెకప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్
వీరేంద్రుడు వీరంగం చేశా డు. పరుగుల సునామీని సృష్టించా డు. ఆకాశమే హద్దు గా చేలరేగాడు. కరిబియన్లకు విశ్వరూపాన్ని చూపించాడు. తొలివన్డే డ బుల్‌సెంచరీ కొట్టాడు. దీంతో భారత్ వన్డేలో అత్యధిక స్కోరు ను సాధించింది. ఇండోర్ లో భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో సెహ్వగ్ రెచ్చిపోయాడు. వన్డేలో తొలిసారిగా డబుల్‌సెంచరీని లిఖించాడు. అంతేకాదు వన్డే ఫార్మట్‌లో ఒక ఇన్నింగ్స్ లో వ్యక్తిగత అత్యధిక స్కోరును చేసి చరిత్ర సృష్టించాడు. మాస్టర్‌బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తరవాత భారత తరపున రెండో డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా సెహ్వగ్ నిలిచాడు. అయితే వన్డే చరిత్రలో వ్యక్తిగత స్కోరును సాధించిన తొలి బాట్స్‌మన్ సెహ్వగే. వీరేంద్రుడు 149 బంతుల్లో మొత్తం 219 పరుగులు చేసి పొలార్డ్ బౌలింగ్ మార్టిన్ క్యాచ్ పట్టగా ఔటైయాడు. సెహ్వగ్ చేసిన పరుగుల్లో 142 రన్స్ కేవలం బౌండరీల రూపంలో వచ్చినవే.
అందులో 25 ఫోర్లు, ఏడు సిక్స్‌లున్నాయి. వన్డేలో ఇదే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.గతంలో సచిన్ దక్షిణాఫ్రికాపై డబుల్ సెంచరీ కోసం 147 బంతులను ఆడాడు. సెహ్వగ్ 41 బంతుల్లో 50 పరుగులు దాటిన తరవాత ఉరుములు మెరుపులతో కూడిన తుపాన్ ఇండోర్ స్టేడియంలో మొదలైంది. అప్పటినుంచే బాదుడు మొదలుపెట్టాడు. దూకుడుతో ఆడుతూ ప్రభంజాన్ని సృష్టించాడు. సెహ్వగ్ పవర్‌ఫుల్ షాట్లకు వెస్టిండీస్ బౌలర్లు చూస్తుఉండిపోయారు.నెత్తి పట్టుకున్నారు. ఇదేం ఖర్మరా బాబు అనుకున్నారు. గత మూడు వన్డేల్లో చూడని పరుగుల ప్రవాహన్ని వెస్టిండీస్‌కు సెహ్వగ్ ఈ మ్యాచ్‌లో చూపించాడు. భారత్ టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్‌ను ఎంచుకున్నది. మూడు వన్డేల్లో రాణించని భారత ఓపెనర్లు జట్టుకు మంచి స్టాండింగ్‌ని ఇచ్చారు. సెహ్వగ్ సెంచరీ, గంభీర్ హాఫ్ సెంచరీలతో కదంతొక్కి భారత్ స్కోరును వికెట్ నష్టపోకుండా ఓవర్‌కు ఏడు పరుగులు చొప్పున 175 పరుగులను ఇచ్చారు. అయితే ఇదే సమయంలో గంభీర్ రనౌట్ రూపంలో అవుటైయాడు.
తొలి వికెట్‌కు 176 పరుగులను చేసిన భారత జట్టు రెండో వికెట్‌కు 140 పరుగులను చేసింది. గంభీర్‌తో జతకట్టి స్కోరుబోర్డును పెంచిన సెహ్వగ్..రైనా క్రీజ్‌లోకి రాగానే రెచ్చిపోయాడు. అప్పటికే సెంచరీతో మంచి ఊపు మీదున్న సెహ్వగ్ దొరికిన బంతిని దొరినట్లుగా బాదేసాడు. సిక్సర్లు, ఫోర్లలతో గ్రౌండ్‌ను హడలెత్తించాడు. సెహ్వగ్‌ను ఎలా అవుట్‌చేయాలో తెలియక వెస్టిండీస్ బౌలర్లు నానాయాతన పడ్డారు. వీరిద్దరు కలసి ఓవర్‌కు 8 చొప్పున స్కోరుబోర్డు వేగాన్ని పెంచారు. అయితే రైనా కూడా హాఫ్ సెంచరీ చేసిన తరవాత పెవిలియన్‌కు చేరాడు. మొత్తం 44 బంతులాడి 55 పరుగులు చేసిన రైనా రోచ్ బౌలింగ్‌లో రనౌట్ అయ్యాడు.
రోచ్ 41 ఓవర్‌లో వేసిన పుల్‌టాస్ బంతిని ఆడబోయిన రైనా లాంగ్‌ఆఫ్ వైపు షాట్ కొట్టాడు. మొదటి పరుగును తీసిన ఇద్దరు రెండో పరుగు తీసేలోపే రస్సెల్ వేసిన త్రో వికెట్లను గిరాటు చేయటం రైనా పెవిలియన్‌కు చేరుకోవటం చకచకా జరిగిపోయాయి. అప్పటికే భారత్ మంచి స్థితిలో ఉన్నది. రెండు వికెట్లు కోల్పోయి 316 పరుగులను చేసింది. భారత తొలి రెండు వికెట్లను రనౌట్ రూపంలోనే పొగొట్టుకున్నది. అయితే సెహ్వగ్ ఇదే సమయంలో కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ కొట్టాడు. భారత్ 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 418 పరుగులను చేసింది.
భారీస్కోరును సాధించటానికి బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు 265 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 153 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. వెస్టిండీస్ జట్టులో రామ్‌దిన్ కొద్దిలో సెంచరీ మిస్ అయిపోయాడు. 96బంతులాడిన అతను 96 పరుగుల వద్దే ఆఖరి వికెట్‌గా అవుటవటంతో వెస్టిండీస్ కథ ముగిసింది. ఇదే మ్యాచ్‌లో జడేజా వన్డేలో 50వ వికెట్‌ను సాధించాడు. అతను వేసిన 39 ఓవర్ ఐదో బంతికి రోచ్ క్యాచ్‌ను పట్టడం ద్వారా జడేజా ఈ రికార్డు సాధించాడు. ఆన్‌సైడ్ కొట్టిన షాట్లద్వారానే సెహ్వగ్ ఎక్కువ పరుగులు చేశాడు.
ఆఫ్‌సైడ్ నుంచి వచ్చిన పరుగులు 99 ఉంటే ఆన్‌సైడ్ నుంచి 120 పరుగులు చేశాడు. రాహుల్ శర్మ తొలి వన్డే మ్యాచ్‌లో అదరగొట్టేసాడు. మూడు వికెట్లు తీశాడు. భారత్‌కు చెందిన ఇద్దరు బ్యాట్స్‌మన్లే ఇప్పటివరకు వన్డే లో డబుల్ సెంచరీలు సాధించార. అది కూడా ఒకే రాష్ట్రంలో జరిగిన గ్రౌండ్‌లో ఈ ఘనతను సొంతం చేసుకోవటం విశేషం. 2004లో పాకిస్థాన్‌పై ముల్తాన్ లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో తొలిసారిగా భారత్ తరపున ట్రిపుల్ సెంచరీ చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన బ్లాస్టర్ తన రికార్డు తనే తిరగరాశాడు. 2008, చెనై్నలో జరిగిన మ్యాచ్‌లో దక్షిణా ఫ్రికాపై 319 పరుగులు చేశా డు. ఇపు డు వన్డే మ్యాచ్‌లో తొలి సా రిగా డబుల్ సెంచరీ చేసిన వీరేం ద్రుడు త్వర లో తన రికార్డును అధిగమిం చే అవకాశాలు లేకపోలేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి