* సిట్టింగ్‌లకే వైఎస్సార్ సీపీ టికెట్
* దాదాపు ఖరారైన టీడీపీ అభ్యర్థులు
* గెలుపు గుర్రాల కోసం కాంగ్రెస్ వేట
విప్ ధిక్కారంపై అనర్హత వేటు తప్పనిసరైతే.. కడపలో మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే ఛాన్సుంది. జగన్ సొంత జిల్లా కావడంతో.. మూడు పార్టీలు హోరాహోరీగా తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల్లో పార్టీల హడావుడి పెరిగింది. ఉప ఎన్నికలు తప్పవనే అంచనాల మధ్య ఎవరి ఏర్పాట్లలో వాళ్లు బిజీ అయ్యారు. జగన్‌కు అండగా నిలుస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, అమర్‌నాథ్ రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగడం లాంఛనమే. ప్రతిపక్ష టీడీపీ కూడా అభ్యర్థుల్ని దాదాపు ఖరారు చేసింది. ఎటొచ్చీ అధికార కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాలను ఎంపిక చేయలేకపోతోంది.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయా పార్టీల నేతలు చెప్తున్నారు. విజయం మాదంటే మాదేనంటూ అప్పుడే ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల ఉప ఎన్నికల్లో YSR కాంగ్రెస్ పార్టీ బంపర్ విక్టరీ కొట్టడంతో అధికార పార్టీ అతి జాగ్రత్తలు తీసుకుంటోంది. మొత్తమ్మీద ట్రయాంగింల్ వార్‌తో కడప జిల్లాలో రాజకీయ వేడి తారస్థాయికి చేరుతోంది. ప్రత్యర్థుల మధ్య మాటలయుద్ధం మొదలవుతోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి