14, డిసెంబర్ 2011, బుధవారం

స్విస్ బ్యాంకుల్లో రూ.25లక్షల కోట్ల నల్లధనం:యల్ కె అద్వాని

స్విస్ బ్యాంకుల్లో మన దేశానికి చెందిన 25 లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఉందని బిజెపి అగ్రనేత ఎల్.కె. అద్వానీ ఈరోజు లోక్‑సభలో చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆ నల్ల ధనాన్ని వినియోగిస్తున్నారన్నారు. స్విస్ బ్యాంకుల్లో నల్లధనాన్ని తీసుకురావడానికి కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. స్విస్ బ్యాంకుల్లో నల్లధనం ఉన్న భారతీయుల జాబితా వికీలీక్స్ వద్ద ఉందని చెప్పారు. విదేశాల్లో నల్ల ధనం దాచుకున్నవారి వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ నల్లధనాన్ని రప్పించి దేశాభివృద్ధికి వినియోగించాలని కోరారు. తమకు స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లు లేవని ఎంపిలు అందరూ ప్రకటించాలన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి