చంద్రబాబునాయుడు అక్రమాస్తుల కేసు విచారణను హైకోర్టు ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో దాఖలైన వెకేట్ పిటిషన్లు జస్టిస్ ఈశ్వరయ్య బెంచ్ నుంచి మరో బెంచ్‑కు బదిలీ అయ్యాయి. చంద్రబాబు తదితరుల అనుబంధ పిటిషన్లు ఏ బెంచ్ విచారించాలనేది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం మేరకు ఉంటుంది.
కాగా అంతకు ముందు జస్టిస్ ఈశ్వరయ్య బెంచ్ ముందు వాదనలు వినిపించటానికి పిటిషనర్ వైఎస్ విజయమ్మ తరపు న్యాయవాది సుశీల్ కుమార్ నిరాకరించారు. బెంచ్ ముందు వాదనలు వినిపించేందుకు ఆయన అనేక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబుకు అనుకూలంగా జస్టిస్ ఈశ్వరయ్య తీర్పులు ఇచ్చారన్నారు.
జస్టిస్ ఈశ్వరయ్య బెంచ్ ముందుకు వెకేట్ పిటిషన్లు వచ్చేలా చంద్రబాబునాయుడు ఓ పథకం ప్రకారం వ్యవహరించారని సుశీల్ కుమార్ తన వాదనలు వినిపించారు. వాస్తవానికి నాట్ బిఫోర్ అనే అంశం రాజ్యాంగంలో ఎక్కడా లేదని, పరిపాలన సులభంగా సాగించుకోవటానికే న్యాయస్థానం నాట్ బిఫోర్ ను ఉపయోగించుకుంటుందన్నారు. ఇప్పుడు ఆ అంశాన్ని వినియోగించుకోవటం విండో షాపింగ్ కాక మరేంటి అని సుశీల్ కుమార్ ప్రశ్నించారు.
9, డిసెంబర్ 2011, శుక్రవారం
బాబు వెకేట్ పిటిషన్లు మరో బెంచ్ కు బదిలీ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
న్యాయవాదిగారు న్యాయమూర్తికి పక్ష
రిప్లయితొలగించండిపాత మంటకట్టు పాట పాడి
వేయు రాయి యనగ న్యాయవ్యవస్థపై
మీకు నమ్మకమ్ము లేక కాదె?
ఒకచో నొక సందర్భం
బొకనికి యనుకూలమైన వేరొక తీరై
యికముందు గలగ బోదని
ప్రకటించెనె న్యాయమూర్తి పరుషత్వమునన్?
మీకు నచ్చినపుడె మీరు వాదింతురె?
నచ్చ కున్న దోషి న్యాయమూర్తి!
నచ్చినటుల కేసు నడిపించె ప్రతివాది
యన్న మీరు బుధ్ది యున్న వారె?