రామ్ చరణ్ హీరోగా వంశీ పైడి పల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు 'ఎవడు' అనే టైటిల్ ఖరారు చేశారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభ పూజా కార్యక్రమం హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. మెగాస్టార్ చిరంజీవి... చరణ్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమానికి ఇంకా అల్లు అర్జున్, అల్లు అరవింద్, దిల్ రాజు, వంశీ పైడి పల్లి హాజరయ్యారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్ రచయితగా, చోటాకె నాయుడు కోరియోగ్రఫీ చేస్తున్నారు. 'ఎవడు' చెర్రీ కెరీర్ లో మంచి హిట్ సినిమాగా నిలవాలని, సంచలన విజయం సాధించాలని ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులంతా ఆకాంక్షించారు. అదే విధంగా 'ఎవడు' సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆవిష్కరించారు. వచ్చే ఏడాది ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది
9, డిసెంబర్ 2011, శుక్రవారం
‘ఎవడు’ మూవీ ఓపెనింగ్ విశేషాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి