తెలుగు సినిమా తెరపై తిరుగులేని రచయితలు పరుచూరి బ్రదర్స్. ఎన్నో సినిమాలకు కథ, కథనం, మాటలు అందించిన సీనియారిటీ వీరి సొంతం. వీరిద్దరిలో ఒకరు 15ఏళ్లు మాష్టారు కూడా. అయితే ఆ సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. డాపరుచూరి గోపాలకృష్ణ మాష్టారు ఇటీవల స్క్రీన్‌ప్లే వర్క్‌షాప్‌లో అందించిన టిప్స్ ఇవి...
1) చూడండి.. నేర్వండి (వాచ్ అండ్ లెర్న్)..
ప్లాప్, హిట్‌తో పనిలేకుండా సినిమా చూడు. రెండిటికీ తేడా ఏంటో విశ్లేషించు. ఏదైనా ఓ హిట్ సినిమా చూసి ప్రేరణ పొందు. కానీ కాపీ కొట్టకు. స్క్రిప్టు రాసేప్పుడు పై కారణాలు విశ్లేషించి జాగ్రత్త పడు.
2) సులువుగా రివీల్ చేయకు (డోన్ట్ షో ఆఫ్)
మీరు చెప్పే కథని మరీ అర్థమయ్యేలా చెప్పే యొద్దు. కథను ప్రేక్షకుడు ముందే ఊహించే యకూడదు. గుప్పిట మూసి ఉంచి... నెమ్మది గా రివీల్ చేయాలి. కొన్నిసార్లు అవసరం మే ర సన్నివేశాల్లో తొడపాశం పెట్టినట్టు చెప్పగల గాలి. ఒక్కోసారి అర్థమరుూ్య అర్థమవనట్టు ఉండాలి. అలా అని అసలు అర్థం కాకపోతే మొదటికే మోసం.
3) కథా సంవిధానం (స్ట్రక్చర్)...
కథను సర్థుకునే తీరునే కథా సంవిధానం అంటారు. కొందరు ఎండ్‌తో సినిమా ప్రారం భిస్తారు. కొందరు మధ్యనుంచి మొదలెడ తారు. ఇంకొందరు ఐదారు సన్నివేశాలు తర్వాత రావాల్సింది ముందే చూపిస్తారు. కథను రాసేప్పుడే ఎడిటింగ్ పద్ధతిలో ఆలో చించగలిగితే మరీ మంచిది. చెప్పే విధానాల్లో రకరకాల పద్ధతులను సినిమా చూసేప్పుడే పరిశీలించాలి. ఏ కథకు ఏది అవసరమో తులనాత్మకంగా పరిశీలించాలి.
4) సందేశం, దిశానిర్ధేశకత్వం ఇమిడి ఉండాలి (ది స్టోరీ మస్ట్ హేవ్ ఎ పాయింట్/ మెసేజ్)...
చివరికెళ్లే సరికి నువ్వేం చెప్పదలిచావు అనే విషయంపై స్పష్టత ఉండాలి. అంతర్లీనంగా ఓ సందేశాన్ని అందిస్తున్నావా? గోల్ ఏమిటి? అనేదానిపై స్పష్టత ఉండాలి.
5) కథ ఎంతసేపు చెబుతావు?
ఈ సంగతిపైనా స్పష్టత ఉండాలి. ఎన్ని పేజీ లు రాశావు కాదు.. ఎంత బాగా రాశావనేదే ముఖ్యం. ఆసక్తి పుట్టించే ఎలిమెంట్ ఏముం దనేది పరిశీలించాలి. 120 పేజీలు ఏ కార ణంతో నింపావ్? అనేది చాలా ముఖ్యం.
6) కథానాయకుడిని ఎంపిక చేసుకో (చూజ్ యువర్ ప్రోటగోనిస్ట్)...
కథానాయకుడే సినిమా ఆడిస్తాడు. నీ కథకు సరైన కథానాయకుడు ఎవరు అనేది రాసేప్పుడు అర్థమవుతుంది. హీరో ఇమేజ్‌ను బట్టి కూడా రాయాలి.
7) నచ్చేలా చూసుకో (మేక్ యాన్ ఇంప్రెషన్)...
మీకే నచ్చింది.. ఎదుటివాడికి నచ్చే లా రాసే ప్పుడే జాగ్రత్త పడాలి. జనాల ఇంప్రెషన్ సాధించాలి అంటే అది తప్పనిసరి. రాసేది లాజిక్ లేకుండా ఉండకూడదు. సందిగ్ధం, విస్మయం, విభ్ర మం.. ఇలా ఎన్నో అంశాలు ఉండేలా చూడా లి. ప్రేక్షకుడిని ఎప్పుడూ చీట్ చేయాలని ప్ర యత్నించకూడదు. ఇంటర్వెల్ బ్యాంగ్.. ఫేక్ గా ఉండకూడదు. అలాగే 'కంటి చూపుతో చంపేస్తా..' అంటే ఒప్పుకున్న జనాలు.. తొడ గొడితే రైలు వెనక్కి వెళ్లడాన్ని మోసేశారు. జాగ్రత్త!
8) థిన్ కథ రాయకండి (ఎవోయిడ్ బీయింగ్ లీనియర్)...
అవసరం మేర రెండు సబ్ ప్లాట్‌లతో కథ రాసుకోవచ్చు. సూపర్‌హిట్ చిత్రం 'షోలే'లో సబ్‌ప్లాట్ సినిమాకే హైలైట్. పరిశీలించండి. ప్రథానకథకు అనుసంధానంగా ఉండే మరో పేరలల్ కథను సబ్‌ప్లాట్ అనొచ్చు.
9) నీలాగే నువ్వు రాయి (బి ఒరిజినల్)...
రాసేందుకు పద్ధతులుంటాయి. మార్గదర్శ కాలు ఉన్నా.. నీదైన పద్ధతిలో నువ్వు వెళ్లు. ఇతరులను కాపీ కొట్టకు. వైవిధ్యంగా ప్రయత్నించినప్పుడే విజయాలు దక్కాయన్న సంగతి మరువకు.
10) నీకు నువ్వే గురువు (యు హేవ్ ఎయిద ర్ గాట్ ఇట్ ఆర్ యు హావ్ నాట్ ఇట్)... ఎంతమంది గురువులు నీకు బోధించి నా.. స్క్రీన్‌ప్లే రాయాలి అని నీలో ఉండాలి. నిత్యం తపించాలి.
కథా బీజం...
ఫ్లాష్ ఆఫ్ యాన్ ఐడియా. తళుక్కుమని వచ్చే ఓ ఆలోచనని పేపర్‌పై పెట్టండి. దాని చుట్టూనే కథ ను అల్లుకోండి. ఒక వార్త చదివితేనో, చూస్తేనో లే దా వింటేనో దీనికి బీజం పడొచ్చు. చూసింది, చది వింది, విన్నది.. దేన్నుంచై నా ఆలోచన రావొచ్చు.
* కథాబీజం, కథాంశం (కథా వస్తువు), ఇతివృ త్తం, కథన అభివృద్ధి, సంఘటన, సంఘర్షణ, దృ శ్యం, దృశ్యమాలిక, సన్నివేశము, పాత్ర, సంభాష ణలు, ధ్వని వాతావరణం, భూమిక, కథా సంవిధా నం, చిత్ర కథ, అభినయ ము, నేపథ్యము, స్థలజ్ఞ త (నేటివిటీ), సందిగ్ధ త, విషమస్థితి (క్రైసిస్), ఫలప్రాప్తి, టెంపో.. ఇన్ని విషయాలుంటాయి. స్క్రీన్ రైటింగులో
ఇవన్నీ భాగం.
- శివాజీ కొంతం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి