అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్‌ను గట్టెక్కించిన చిరంజీవి ఆ సమయంలో పెట్టిన షరతులు, అధిష్ఠానాన్ని ఆందోళన పెట్టించిన తీరు ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. ఆపద్భాంధవుడిగా ఆదుకున్నం దుకు చిరంజీవికి కృతజ్ఞత ప్రకటిస్తూనే, అధిష్ఠానాన్ని క్లిష్ట సమయంలో చెమటలు పట్టించి, 'కాంగ్రెస్ మెడలు వంచి అనుకున్నది సాధించారన్న' ప్రచారం పార్టీ నాయకత్వం మరిచిపోదని కాంగ్రెస్ సీనియర్లు తమ అనుభవాలను గుర్తు చేస్తున్నారు.
కాంగ్రెస్‌ను క్లిష్ట సమయంలో ఆదుకున్నప్పటికీ, అప్పుడు చిరంజీవి అధిష్ఠానంతో వ్యవహరించిన తీరు మా త్రం పార్టీ నాయకత్వాన్ని బెదిరించిన మాదిరిగానే ఉందని, ఇది చిరంజీవి రాజకీయ భవితవ్యానికి ఇబ్బంది లిగించే అంశమేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పార్టీలో తమ ఎమ్మెల్యేలకు అవమానం జరుగుతోందని, తమను పట్టించుకోవడం లేదన్న ఆవేదనలో వాస్తవం ఉన్నప్పటికీ దానిని ఆ సమయంలో చర్చించకుండా ఉంటే చిరంజీవికి అధిష్ఠానం వద్ద మరింత గౌరవం పెరిగేదంటున్నారు. అవిశ్వాసానికి ముందు తమ పార్టీ ఎమ్మెల్యేలు అసం తృప్తితో ఉన్నారని చెప్పడం, దానితో రాత్రి ఆజాద్, అహ్మద్ ్‌పటేల్ సహా సీఎం, బొత్స చర్చలు జరపడం అన్నీ తమను బెదిరించి దారికి తెచ్చుకోవడానికేనన్న అభిప్రాయం పార్టీ నాయకత్వంలో బలపడితే భవిష్యత్తులో చిరు కాంగ్రెస్‌లో ఒకరిగా మిగిలిపోవడమే తప్ప, ఆయనకు ప్రత్యేక గుర్తింపు దక్కడం కష్టమని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.
కాంగ్రెస్‌ను బెదిరించిన వారెవరూ రాజకీయంగా లబ్థి పొందలేదని, శరద్‌పవార్ వంటి నేతలే బెదిరించి దారికొ చ్చారని, రాష్ట్రంలో కాసు, చెన్నారెడ్డి వంటి నేతలు కూడా పార్టీని బెదిరించి దెబ్బతిన్నారన్నారని గుర్తు చేస్తున్నారు. 'ఎన్నికల కమిషన్ దగ్గర పీఆర్పీ విలీన ప్రక్రియ ముగిసింది. ఇక స్పీకర్ ఆ న్యాయపరమైన తేలిక పాటి చిక్కులు కూడా పూర్తి చేస్తే అధికారికంగా విలీన మయినట్లే. నిజానికి, శోభానాగిరెడ్డిపై వేటు వేసేందుకే ఆ తతంగం ఆలస్యమయింది. రెండు రోజుల్లో అది కూడా పూర్తయితే ఇక చిరంజీవి కాంగ్రెస్ నాయకుడే. అప్పుడు కాంగ్రెస్ సత్తా ఏమిటో ఆయనే చూస్తారు. అవిశ్వాసానికి ముందు చిరంజీవి వ్యవహరించిన తీరు గుర్తు పెట్టుకుంటే చిరుకు కష్టాలే. ఆయన మిగిలిన వారిలా అవమానాలు ఎదుర్కోకతప్పదు. అలాగని ఆయన తో పాటు వచ్చి చేరిన ఎమ్మెల్యేలంతా మళ్లీ ఆయన వెంట వెళతారన్న గ్యారంటీ కూడా ఉండదు. అటు చిరంజీవి కూడా మళ్లీ వెనక్కి వెళ్లలేరు. ఇవన్నీ ఆలోచించుకుని ఉండవలసింద'ని ఓ కాంగ్రెస్ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
అయితే.. చిరంజీవి ఆ సమయంలో బెట్టు చేయటం సరైనదేనని, తాము చేయలేని పని చిరంజీవి చేశారని కాంగ్రెస్ తెలంగాణ నేతలు అభినందిస్తున్నారు. కాంగ్రెస్‌ను సరైన సమయంలో ఇరుకున పెట్టిన చిరంజీవి తాము అనుకున్నది సాధించారని, కానీ తమ పార్టీ ఎమ్మెల్యేలు తెలంగాణ గురిం చి ఒక్క మాట కూడా మాట్లాడలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరో రెండున్నరేళ్ల వరకూ చిరంజీవిని కాంగ్రెస్ నాయకత్వం ఏమీ చేయలేదని, ఆయన అవసరం పార్టీకి చాలా ఉందని వివరిస్తున్నారు.
కాగా, చిరంజీవికి ఇద్దరు ప్రముఖులు తప్పుడు సలహా లు ఇస్తున్నారని.. వారివల్లే కాంగ్రెస్‌తో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని పీఆర్పీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల ముందు పనిచేసి ఆ తర్వాత పత్తా లేకుండా వెళ్లి ఇటీవలే వచ్చిన ఓ నేత, మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేస్తున్న మరో ప్రజాప్రతినిధి కలసి చిరంజీవిని తప్పుదోవపట్టిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.అహ్మద్‌పటేల్, ఆజాద్ ఫోన్లు చేసినప్పుడు షరతులు విధిం చకుండా, వారితో ఎక్కువ బ్రతిమిలాడించుకోకుండా మీరు చెప్పినట్లే చేస్తామని అని ఉండే బాగుండేదం టున్నారు. కానీ చిరంజీవి వారిద్దరి మాటలు విని రెండు సార్లు వారిని బ్రతిమిలాడించుకునే పరిస్థితి తెచ్చారని, దాని పరిణామాలు ఆలస్యంగానయినా తీవ్రంగానే ఉంటా యని పీఆర్పీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి కోసం తపన పడుతున్న ఓ నేత మాటలకు చిరు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంపై సొంత పార్టీలోనే నిరసన వ్యక్తం అవుతోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి