దుబాయ్: భారత స్పిన్నర్ ఆశ్విన్ వన్డే క్రికెట్ ర్యాంకింగ్‌లో టాప్-20లో స్థానం సంపాదించాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో ఆశ్విన్‌కు 18వ స్థానం దక్కింది. నిలకడగా రాణిస్తున్న యువ ఆటగాడు విరాట్ కొహ్లి నాలుగో స్థానానికి ఎగబాకాడు. విండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుసగా మూడు అర్థ సెంచరీలు సాధించిన రోహిత్ శర్మ 21 స్థానాలు దాటుకుని 35వ ర్యాంకులో నిలిచాడు. గంభీర్ 19వ ర్యాంకుకు పడిపోయాడు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు హషిమ్ ఆమ్లా, డీవిలియర్స్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. జొనథాన్ ట్రాట్ మూడో ర్యాంకులో నిలిచాడు.
7, డిసెంబర్ 2011, బుధవారం
వన్డే ర్యాంకింగ్ టాప్-20లో ఆశ్విన్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి