8, డిసెంబర్ 2011, గురువారం

రామ్ కి బెల్లంకొండ మద్య గొడవ ఏంటి

 బెల్లంకొండ సురేష్,రామ్ ల కాంబినేషన్ లో వచ్చిన కందిరీగ చిత్రం విడుదల అయ్యిన తర్వాత వీరిద్దరి మధ్యా గొడవలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ గొడవలుకు కారణం బెల్లంకొండ రెమ్యునేషన్ ఎగ్గొట్టటమే అని అప్పట్లో వినిపించింది. అయితే అస్సలు గొడవ వేరు అని తెలిసిన వారు చెప్తున్నారు. ఈ గొడవకు కారణం గౌతమ్ మీనన్ చిత్రం అని తెలుస్తోంది. గౌతమ్ మీనన్ చిత్రంలో రామ్ మొదట్లో హీరోగా ఓకే చేసాడు. అప్పుడు బెల్లంకొండ ఆ చిత్రాన్ని తెలుగు నిర్మాతగా తను వ్యవహరిద్దామని ప్లాన్ చేసి ప్రయత్నించాడు. అయితే రామ్ కి మాత్రం ఆ చిత్రం తన బాబాయ్ స్రవంతి రవికిషోర్ చేయాలని గౌతమ్ మీనన్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేసాడు. దాంతో బెల్లంకొండ కు కాలి ఆయన ఇవ్వాల్సిన డబ్బుని ఆపు చేయటం, అప్పుడు రామ్ ఫిల్మ్ ఛాంబర్ కి వెళ్లి మా లో కంప్లైంట్ చేయటం,వారు సీన్ లోకి వచ్చి డబ్బు ఇప్పించారు. చివరకు ఆ ప్రాజెక్టు రామ్ కు కూడా రాకుండా పోయింది. నాని వచ్చి సినిమా పూర్తి చేస్తున్నారు. దాంతో బెల్లంకొండ సురేష్,రామ్ ల మధ్య దూరం పెరిగింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి