9, డిసెంబర్ 2011, శుక్రవారం

ఐఐటీ విద్యార్థికి రూ.70 లక్షల వేతనం

 

ఐఐటీ-కాన్పూర్ విద్యార్థికి కళ్లుచెదిరే ఆఫర్ లభించింది. సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ఎంటెక్ విద్యార్థి సిద్ధార్థ్ అగర్వాల్ (కంప్యూటర్ సైన్స్-ఇంజనీరింగ్)కు ఏడాదికి సుమారు రూ.70 లక్షల వేతన ప్యాకేజీతో ఉద్యోగం ఇచ్చింది. వారంరోజులుగా జరుగుతున్న క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో భాగంగా శుక్రవారం ఫేస్‌బుక్ ఈ ప్యాకేజీ ఇచ్చిందని ఐఐటీ-కే రిజిస్ట్రార్ సంజీవ్ కషేల్కర్ చెప్పారు. ఫేస్‌బుక్ ఇప్పటివరకు ఇచ్చిన ప్యాకేజీల్లో సిద్ధార్థ్‌కు ఇచ్చిందే అత్యధికమని పేర్కొన్నారు. గతవారం ఐఐటీ-ఖరగ్‌పూర్ విద్యార్థికి కూడా ఫేస్‌బుక్ ఇలాంటి ఆఫర్‌నే ఇచ్చింది

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి