అవిశ్వాసం సందర్భంగా పార్టీపై తిరుగుబాటు చేసిన వారితో పాటు, రాజీనామాలు చేసిన వారి స్థానాలకు జరిగే ఉప ఎన్నికల నిర్వహణ, అంతకుముందు వారిపై వేటు వేసే అంశంలో ముఖ్యమంత్రి- సీనియర్ మంత్రుల మధ్య దూరం పెరుగుతోంది. జగన్ వర్గంపై వేటు వేసి ఉప ఎన్నికలకు వెళ్లాల్సిందేనని సీనియర్ మంత్రులు ఒత్తిడి చేస్తుండగా.. ఎన్నికల్లో పొర పాటున పార్టీ పరాజయం పాలయితే తన రాజ కీయ భవితవ్యం ఏమిటన్న దిశగా ముఖ్యమంత్రి.. ఇలా విభిన్న ఆలోచనల నడుమ యుద్ధం కొనసాగు తోంది. పార్టీ విప్‌ను ధిక్కరించి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి, వెంటనే ఉప ఎన్నికలకు వెళ్లాలని మెజారిటీ పార్టీ నాయకులు, శ్రేణులు కోరుకుంటున్నారు.
ప్రధానంగా.. జగన్ వర్గంపై ఆది నుంచి ఒంటికాలితో లేస్తున్న ఎంపీ వి.హన్మంతరావు, చిరంజీవి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి, జానారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణ వంటి సీనియర్లు జగన్ వర్గ ఎమ్మెల్యేలపై వేటు వేసి, ఉప ఎన్నికలకు సిద్ధమవాలని కోరుతున్నారు. జగన్ వర్గాన్ని ఇప్పుడు అణచివేస్తేనే భవిష్యత్తులో పార్టీ శ్రేణులకు నైతిక స్థైర్యం వస్తుందని, లేకపోతే జగన్‌కు కాంగ్రెస్ పారిపోయి భయపడి పారిపోయిందన్న సంకేతాలు వెళతాయన్నది వారి ఆవేదన. చిరంజీవి-బొత్స కూడా ఎన్నికలకు వెళ్లాలని ఒత్డిడి చేస్తున్నారు.
అయితే.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారని సీనియర్ మంత్రులు చెబుతున్నారు. ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినట్టయితే.. 24లో కనీస స్థానాలు కాంగ్రెస్‌కు దక్కకపోతే ఆ ప్రభావం తన సీటుపై ఉంటుం దన్న ముందు జాగ్రత్తతోనే కిరణ్ వారిపై వేటు వేసేందుకు వెనుకాడుతున్నారని ఓ సీనియర్ మంత్రి అసలు విషయం వెల్లడించారు. గెలిస్తే అది తన విజయం గా ప్రచారం చేసుకునేందుకు బొత్స సిద్ధంగా ఉంటారని, ఓడితే తన అసమర్థ తగా చిత్రీకరించేందుకు ప్రత్యర్థి వర్గం కూడా సిద్ధంగానే ఉంటుందని సీఎం అంచనా వేస్తున్నారు.
ఇటీవలి జరిగిన మంత్రుల భేటీలో కూడా సర్వే విష యాలు, జగన్-బాబును ఎదుర్కోవాలని చెప్పారే తప్ప, ఉప ఎన్నికలకు సిద్ధం గా ఉండాలని చెప్పలేదని గుర్తు చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనా రాయణ మాత్రం ఉప ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్నారు. వాట ిలో గెలిస్తే అది తన ఘనతేనని, ఓడితే ముఖ్యమంత్రి చూసుకుంటారన్న వ్యూ హంతో ఉన్నారు. అటు సీఎంని వ్యతిరేకిస్తున్న మంత్రులు సైతం జగన్ వర్గంపై వేటు వేసి, ఉప ఎన్నికలకు వెళ్లాలని ఒత్తిడి చేస్తున్నారు. సీనియర్ ఎంపీ వి.హ న్మంతరావు ఇటీవల కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎ.కె. ఆం టోనీని కలిసి జగన్ వర్గ ఎమ్మెల్యేలపై వేటు వేసి, ఉప ఎన్నికలకు వెళ్లాలని కోరారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి