8, డిసెంబర్ 2011, గురువారం

కొంతమంది చేతుల్లోనే నేడు పరిశ్రమ ఉంది:గిరిబాబు

సినీ పరిశ్రమ కొద్దిమంది చేతుల్లో బందీ అయిందని ప్రముఖ సినీ నటుడు గిరిబాబు వాఖ్యానించారు. పర్చూరు మండలంలోని బోడవాడ గ్రామంలో బుధవారం జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొన్న గిరిబాబు కొద్దిసేపు విలేకరులతో ముచ్చటించారు. కొంతమంది వారి వారసులనే నటులుగా పెట్టి సినిమాలు తీయడం, వారే ఎగ్జిబిట్ చేసుకోవడం వల్ల చిన్న నిర్మాతలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయనన్నారు. చిన్న నిర్మాతల సినిమాలకు థియేటర్లు కూడా దొరకడం లేదని గిరిబాబు చెప్పారు. గతంలో సినిమాలు కథాంశం, కథానాయకుల ప్రాధాన్యతతో నడిచేవని, అటువంటిది నేటి సినిమాల్లో కుటుంబ కథాంశం, ప్రేమసందేశం, సామాజిక దృక్పథం మచ్చుకైనా కానరావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాల్లో నేరప్రవృత్తిని ఎక్కువగా చూపిస్తుండడం బాధాకరమని గిరిబాబు పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి