విక్రమ్, దీక్షాసేథ్ జంటగా సుశీంద్రన్ దర్శకత్వంలో పీవీపీ సినిమా పతాకంపై పరమ్ వి. పొట్లూరి సమర్పణలో ప్రసాద్ వి.పొట్లూరి నిర్మించిన 'వీడింతే...' ఆడియో ఆవిష్కరణ వేడుక బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో సీడీని వినాయక్ ఆవిష్కరించి విక్రమ్‌కి ఇచ్చారు. యువన్‌శంకర్ రాజా సంగీతం అందించిన ఈ పాటలు వేల్ రికార్డ్స్ ద్వారా మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఈ వేడుకలో అతిథిగా పాల్గొన్న రాజమౌళి పై విధంగా స్పందించారు. ''సుశీంద్రన్ దర్శకత్వం వహించిన 'నా పేరు శివ చూశాను'. ఆ సినిమాని ఎంతో టెంపోతో తీశారు. ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను'' అని వీవీ వినాయక్ చెప్పారు. క్రిష్ మాట్లాడుతూ -''తమిళంలో నేను చేసిన 'వానమ్' చిత్రానికి యువన్‌శంకర్ రాజా పాటలిచ్చారు. నా తెలుగు గమ్యం, వేదం చిత్రాల పాటలు వేల్ రికార్డ్స్ ద్వారా విడుదలయ్యాయి. ఈ పాటలు, సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను'' అన్నారు. సుశీంద్రన్ మాట్లాడుతూ -''ఇది పక్కా కమర్షియల్ సినిమా. విక్రమ్‌తో సినిమా చేయడం మంచి అనుభూతినిచ్చింది. ఇందులో కె.విశ్వనాథ్ కీలక పాత్ర చేశారు. అంత పెద్ద దర్శకుడితో సినిమా చేయడం మర్చిపోలేను'' అన్నారు. విక్రమ్ మాట్లాడుతూ -''ఇందులో నేను జిమ్‌బాయ్ పాత్ర చేశాను. ఈ పాత్రానుసారం పలు రకాల గెటప్స్ వేయడం జరిగింది. ఏప్రిల్ 17 నా పుట్టినరోజు. నా లక్కీ డేట్ అది. ఈ చిత్రంలో మొత్తం 17 గెటప్స్ వేశాను. కొన్ని గెటప్స్ సెకన్లపాటు, కొన్ని ఒకటి, రెండు నిముషాలపాటు సాగుతాయి. సుశీంద్రన్ అద్భుతమైన దర్శకుడు. యువన్‌శంకర్ రాజా మంచి పాటలిచ్చారు'' అన్నారు. ''మొదటిసారి విక్రమ్ సినిమాకు పాటలిచ్చాను'' అని యువన్ అన్నారు. ఈ వేడుకలో నిర్మాత సురేష్‌బాబు, సంగీతదర్శకుడు కీరవాణి, ఆయన సతీమణి, వేల్ రికార్డ్స్ అధినేత వల్లి, రాజమౌళి సతీమణి రమా, నటీనటులు దీక్షాసేథ్, సలోని, ప్రదీప్‌రావత్, కెమెరామాన్ మది, పీవీపీ సీఈవో వినయ్, క్రీడాకారిణి జ్వాలా గుత్తా తదితరులు పాల్గొన్నారు.
8, డిసెంబర్ 2011, గురువారం
వీడింతే ఆడియో విడుదల
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి