పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోమవారం ఢిల్లీ వెళుతున్నారు. ఆదివారమే ఆయన ఢిల్లీ వెళ్లాలని భావించినా పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ అందుబాటులో లేకపోవడంతో సోమవారం వెళ్లాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆయన మూడు రోజులపాటు హస్తినలో మకాం వేయనున్నారు.
ఆజాద్‌తోపాటు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్, కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యులందర్నీ కలవాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆయన సోనియా అపాయింట్‌మెంట్‌కోసం ప్రయత్నిస్తున్నారు. వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితితోపాటు ప్రభుత్వ పనితీరుపైనా ఆయన హైకమాండ్ పెద్దలకు నివేదిక అందించనున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి