అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేసిన వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ఉపఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు గడ్డు పరిస్థితి తప్పదని బీజేపీ పేర్కొంది. అందుకనే వీరిపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ వెనుకాడుతోందని వ్యాఖ్యానించింది. పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఆదివారమిక్కడ మల్లారెడ్డి, రఘునాథ్, కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
అవిశ్వాసం గెలిచామన్న సంతోషం కన్నా వచ్చే ఉపఎన్నికల్ని ఎలా ఎదుర్కోవాలనే భయమే కాంగ్రెస్‌ను వెంటాడుతోందని ఎద్దేవా చేశారు. ఉపఎన్నికలు రాష్ట్రానికి దశ, దిశ చూపుతాయన్నారు. తెలంగాణ కోసం దీక్షంటూ హడావుడి చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటేయటంపై జేఏసీలో చర్చిస్తామని చెప్పారు. చేనేత కార్మికుల సమస్యలపై ఈనెల 14నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ఉపవాస దీక్షలు చేయనున్నట్టు తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి