15, డిసెంబర్ 2011, గురువారం

పెద్ద ఎత్తున ఉప సమరం

 

 

 

* 24 చోట్ల ఏప్రిల్‌లో ఎన్నికలు ?

 * ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణాలో పొలిటికల్ టెస్ట్

 * నలుగు ప్రధాన పార్టీలపై తీవ్ర ప్రభావం

 * కిరణ్, చంద్రబాబు, జగన్, కేసీఆర్‌లకు బలపరీక్ష

 

 ఎవ్వరూ అనుకోని రీతిలో 24 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటే మన రాష్ట్రంలో ఈ మినీ ఎలెక్షన్స్ జరగొచ్చు. పోటీలో ఎంతమంది ఉన్నప్పటికీ రాష్ట్ర రాజకీయమంతా ఆ నలుగురుచుట్టూ తిరగడం ఖాయం. రాష్ట్రంలో తొలిసారి భారీ సంఖ్యలో ఉప ఎన్నికల సమరానికి తెరలేవబోతోంది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ నుంచి ఇంకా తుది నిర్ణయం వెలువడనప్పటికీ నెలాఖరులో వారిపై అనర్హత వేటు పడడం ఖాయంగానే భావిస్తున్నారు. దాంతో యుపి ఎన్నికల షెడ్యూలుతోపాటే రాష్ట్రంలోని ఉప ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశముంది.

 

 సీమాంధ్రలో 17 నియోజకవర్గాలకు, తెలంగాణాలో ఏడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యమవుతున్నాయి. సీమాంధ్రంలో కాంగ్రెస్, టీడీపీ,వై.ఎస్.కాంగ్రెస్‌ల మధ్య ముక్కోణపు పోటీ సాగనుంది. తెలంగాణాలో ఈపార్టీలతోపాటు టీఆర్‌ఎస్ కూడా తన సత్తా చాటుకునేందుకు సిద్దమవుతోంది. ఈఎన్నికలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పార్టీల అధినేతలు చంద్రబాబు, వై.ఎస్.జగన్, కేసీఆర్‌ల బల పరీక్షకు వేదిక కానున్నాయి. రాష్ట్రంలో రాజకీయమంతా ఈనలుగురి చుట్టూనే తిరుగుతోంది. కిరణ్ రాష్ట్రాధినేతగా ఉంటే చంద్రబాబు తొమ్మిదేళ్ళు సీఎంగా ఉండి గత ఏడున్నర సంవత్సరాలుగా ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు.

 

 కొత్త తరం నేతగా, దివంగత నేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి వారసునిగా వై.ఎస్. జగన్ జనంలోకెళ్తున్నారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన ధ్యేయంగా కేసీఆర్ పోరాటం సాగిస్తున్నారు. వీరందరికీ ఇప్పడు ఎన్నికల ఫీవర్ పట్టుకుంద

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి