4, డిసెంబర్ 2011, ఆదివారం

సోలో శాటిలైట్ రైట్స కోటి డెబ్బై లక్షలు....?

 సోలో చిత్రం శాటిలైట్ రైట్స్ ని మా టీవీ వారు తీసుకున్నట్లు సమాచారం. ఇందు నిమిత్తం కోటి డబ్బై ఐదు లక్షలు చెల్లించినట్లు చెప్తున్నారు. పూరి జగన్నాద్ బొమ్మరిల్లు తీస్తే ఎలా ఉంటుందో అదే సోలో  చిత్రంగా ప్రమోట్ చేయటం బాగా కలిసివచ్చింది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్,జయసుధ వంటి స్టార్స్ ఉండటం, దాంతో టీవిలో వేస్తే మంచి రేటింగ్ లు వస్తాయని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో డైలాగులుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ కూడా మంచి మార్కులే కొట్టేసింది.

ఇక లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని పరుశరామ్ రూపొందించారు. ఆయన గతంలో యువత,ఆంజనేయులు చిత్రాలు నిర్మించారు. ఆంజనేయులు చిత్రం ధియోటర్లో ఫ్లాప్ అయినా టీవీల్లో మంచి రేటింగ్స్ ని సంపాదించి శాటిలైట్ రైట్స్ కొనుక్కున్న వారికి బాగా డబ్బులు తెచ్చిపెట్టడంతో ఈ చిత్రానికి మంచి రేటుని మా టీవీ వారు ఫిక్స్ చేసి తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇక నారా రోహిత్ కూడా బయిట మంచి ఆఫర్స్ వస్తున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి