కాంగ్రెస్ నాయకులు ఎవరు ఎప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తారన్నది ఎవరికీ తెలియదు. పార్టీ ప్రయోజనాలకన్నా వ్యక్తి గత ప్రయోజనాలే వారికి ప్రధానం. అయితే అలా అని చెప్పి ఉన్న అధికారాన్ని పోగొట్టుకునేందుకు కూడా వారు ఇష్టపడరు. ఇపుడు రాష్ట్ర ప్రభుత్వంపై తెదేపా అవిశ్వాస తీర్మానం పెట్టింది. మామూలుగా అయితే అవిశ్వాస తీర్మానాన్ని దీటుగా ఎదుర్కొని తెదేపాను రాజకీయంగా దెబ్బ తీయాలని అధికార పక్షం అనుకుంటుంది. తెదేపా అవిశ్వాసాన్ని దెబ్బ తీయడం అంటే ఈ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అండగా నిలబడినట్టే అవుతుంది. ప్రభుత్వం బలడటం అంటే కిరణ్ నాయకత్వం బలంగా ఉన్నట్లు లెక్క. తనకు తిరుగులేని బలం ఉందని కిరణ్ అనుకుంటే రానున్న రోజుల్లో ఆయన ఇక తమ మాట వినే పరిస్థితి ఉండదన్న అనుమానం అధికార పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. అందుకే అవిశ్వాస తీర్మానం ఏదో విధంగా చర్చకు రాకుండా ఉండటమే మంచిదన్న అభిప్రాయం అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే విషయంలో తెదేపాకు అసలు స్పష్టత లేదనిపిస్తోంది. తెదేపా అధినేత, ఆ పార్టీ నాయకులు ముందు నుంచి చెబుతున్నది ఒకటే. రైతుల సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని. అంటే రైతుల సమస్యల విషయాన్ని మినహాయిస్తే మిగిలిన రంగాల్లో ప్రభుత్వ పనితీరు బాగా ఉన్నట్టే కదా. ఒకవేళ అవిశ్వాసంపై చర్చ జరిగితే కేవలం రైతుల సమస్యలకే తెదేపా పరిమితమవుతుందా? చివరకు తెదేపా అవిశ్వాస తీర్మానం కూడా ఎమ్మెల్యేల రాజీనామాల తరహాలోనే ఉంటుందా?

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి