కాంగ్రెస్ మెడలు వంచి తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలనేది ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలకు తెలిసొచ్చింది.
మైనారిటీ సర్కారుకు ముందున్నది ముసళ్ల పండుగే
కాంగ్రెస్ తమ ‘ప్రాధాన్యం’ గుర్తించిందని పీఆర్పీ ఎమ్మెల్యేల సంబరం
విలీనం రద్దు కోసం ఎన్నికల సంఘానికి అప్పీలు చేయాలన్న సూచనలు
స్పీకర్‌కు ఎమ్మెల్యేలు విలీనం లేఖలు ఇవ్వకుండా పీఆర్పీగానే కొనసాగే యోచన
సర్కారుకు ఇక పీఆర్‌పీ సభ్యులు, ఎంఐఎంల మద్దతే కీలకం
వారిని సంతృప్తి పరిచినన్నాళ్లే ప్రభుత్వానికి మనుగడ
హైదరాబాద్, న్యూస్‌లైన్: అవిశ్వాస తీర్మానం పుణ్యమా అని.. కాంగ్రెస్ మెడలు వంచి తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలనేది ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలకు తెలిసొచ్చింది. కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేసి దాదాపు ఆరు నెలలైనా ఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వ పెద్దలకు.. అవిశ్వాస తీర్మానం సమయంలో తమ విలువేమిటో తెలిసొచ్చిందని వారు సంబరపడుతున్నారు. ఇన్నాళ్లుగా కాంగ్రెస్‌కు ఆక్సిజన్ అందిస్తోంది తామేనని చెప్తున్నా పెడచెవిన పెట్టిన నేతలు.. అవిశ్వాసంపై ఓటింగ్ సమయంలో తాము ఇచ్చిన ఝలక్‌తో దిగొచ్చారని పీఆర్పీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఇకపై కూడా ‘ఇదే ఫార్ములా’ను అనుసరిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుభవాల నేపథ్యంలో.. అసలు పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసి పొరపాటు చేశామన్న భావనకు కొందరు నేతలు వచ్చారు. మైనారిటీలో ఉన్న కిరణ్ సర్కారుకు బయటి నుంచి మద్దతిస్తే బాగుండేదని.. తద్వారా కావాల్సిన పనులన్నీ ముక్కుపిండి చేయించుకోగలిగే వారమని అభిప్రాయపడుతున్నారు. అట్లాకాకుండా మహాసముద్రం లాంటి కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేయటంవల్ల తమకు తగినంత గౌరవం దక్కకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల ప్రాభవం పెరుగుతోందని, ప్రజలు ప్రాంతీయ పార్టీలవైపే మొగ్గుచూపుతున్నందున.. పీఆర్పీని ప్రత్యేక పార్టీగా కొనసాగిస్తూ ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజల మన్ననలు చూరగొంటేనే ఉత్తమమనే భావననూ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని.. పార్టీని విలీనం చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆమోదముద్ర వేయించుకున్నందున.. దానిని రద్దుచేసి పార్టీని యథావిధిగా కొనసాగించాలని ఈసీకి అప్పీలు చేయటానికి గల అవకాశాలను పరిశీలిస్తే మంచిదన్న సలహాలు కూడా ఒకరిద్దరు నాయకుల నుంచి వస్తున్నాయని సమాచారం. మరోవైపు.. పీఆర్పీ సభ్యులను కాంగ్రెస్‌లో విలీనం చేయాలంటూ అసెంబ్లీ స్పీకర్‌కు పార్టీ అధ్యక్షుడి పేరిట లేఖ ఇచ్చినప్పటికీ.. ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా లేఖలు ఇవ్వాల్సి ఉంది కాబట్టి.. విలీనం ప్రక్రియ ఆగిపోయింది. పార్టీ ఎమ్మెల్యేలు ఎలాగూ లేఖలు ఇవ్వలేదు కాబట్టి.. ఆ లేఖలు ఇవ్వకుండా పీఆర్పీ ఎమ్మెల్యేలుగానే కొనసాగితే సరిపోతుందని ఒక ఎమ్మెల్యే సూచించినట్లు సమాచారం.
ఇక దినదిన గండమే: కాంగ్రెస్‌లో గుబులు
అవిశ్వాసంపై ఏదోవిధంగా గట్టెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతానికి ఊపిరిపీల్చుకున్నా.. ఇకపై సర్కారు పరిస్థితి దినదిన గండమే అని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. సోమవారం అసెంబ్లీలో జరిగిన అవిశ్వాసంపై ఓటింగ్‌లో ప్రభుత్వానికి మద్దతుగా 160 మంది సభ్యులు ఓటు వేశారు. ఇందులో అచ్చంగా కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య కేవలం 136 మాత్రమే. అసెంబ్లీలో ప్రస్తుత సభ్యుల సంఖ్య మేరకు.. సర్కారుకు ఉండాల్సిన కనీస మెజారిటీ (మేజిక్ ఫిగర్) 144. దీనినిబట్టి కాంగ్రెస్‌కు సొంతంగా మెజారిటీ లేదన్నది సుస్పష్టం. అవసరమైన దానికన్నా ఇంకా 8 మంది సభ్యులు తక్కువగా ఉన్నట్లే లెక్క. అయితే.. పీఆర్పీ నుంచి 17 మంది, ఎంఐఎం నుంచి ఆరుగురు, ఒక స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్‌కు అండదండలు అందించటంతో ప్రభుత్వం అవిశ్వాసం నుంచి బతికి బట్టకట్టింది. అంటే.. ఆ పార్టీల మద్దతు లేకపోతే వాస్తవంగా కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది మైనారిటీ ప్రభుత్వమేనని తేలుతోంది. పీఆర్‌పీ, ఎంఐఎంల అండతో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం మాత్రమే ఇపుడున్నట్లుగా భావించాలి. కాంగ్రెస్‌లో పీఆర్పీ శాసనసభాపక్ష విలీనం ఇంకా పూర్తికాలేదు.
అవిశ్వాసం నోటీసు ఇచ్చిన రోజునే పీఆర్పీ పథకం ప్రకారం అసమ్మతి గళం విప్పింది. ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని స్వయంగా ప్రకటించిన చిరంజీవి చివరివరకు విప్ జారీ చేయకుండా కాంగ్రెస్‌ను బ్లాక్‌మెయిల్ చేసేలా వ్యవహరించారు. చివరకు కాంగ్రెస్ అగ్రనేతలు అహ్మద్‌పటేల్, గులాంనబీ ఆజాద్‌లు కల్పించుకొని ‘మెగా ఆఫర్లు’ ఆశచూపటంతో చల్లబడ్డారు. ఇక ఎంఐఎం కూడా.. హైదరాబాద్ మేయర్ పదవి తమకు ఇవ్వాల్సిందేనంటూ మెడపై కత్తిపెట్టి మరీ సాధించుకుంది. ఇప్పుడే ఇలా ఉంటే.. మున్ముందు వీరిని నమ్ముకుని మైనారిటీ ప్రభుత్వాన్ని ఎలా నెట్టుకురావాలో అంటూ కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ రెండు పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు సంతృప్తపరుస్తూ, వారి కోర్కెలు తీర్చుతూ ఉంటేనే.. సర్కారు పదిలంగా ఉంటుందని.. లేదంటే కష్టాలు తప్పవని వారికి బెంగపట్టుకుంది.
పదవులు భర్తీ చేస్తే అతలాకుతలమే...
మరోవైపు పీఆర్‌పీ నేతలు మంత్రి పదవులతో పాటు కార్పొరేషన్‌లు, ఇతర పదవులపై ఎక్కువగానే ఆశలు పెట్టుకున్నారు. కేంద్రంలో చిరంజీవికి ఒక బెర్తు ఇవ్వాలని, రాష్ట్ర మంత్రివర్గంలో మూడుకు తగ్గకుండా పదవులు కేటాయించాలని వారు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారి నుంచి మరిన్ని డిమాండ్లు తెరమీదకు వచ్చే అవకాశాలున్నాయని కాంగ్రెస్ భావిస్తోంది. మైనారిటీలో పడిన ప్రభుత్వాన్ని తామే నిలబెట్టామని.. అందుకు తగ్గట్లుగా కాంగ్రెస్ తమకు ప్రతిఫలం చూపించాలని ఆ పార్టీ నేతలు పట్టుపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల్లోనే పదవుల భర్తీపై చర్యలు చేపట్టాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నాయి. ఇప్పటికే పదవులు దక్కలేదని, దక్కిన పదవుల్లో ప్రాధాన్యం లేదని అసంతృప్తితో రగులుతున్న పార్టీ ఎమ్మెల్యేలకు తోడు.. ఇప్పుడు పీఆర్‌పీ ఎమ్మెల్యేలు కూడా జతకావటంతో.. పదవుల భర్తీ చేపడితే పార్టీ పరిస్థితి అతలాకుతలం అవుతుందేమోనన్న భయం కాంగ్రెస్ నేతలను పట్టుకుంది. ఈ తరుణంలో ఒకరికి పదవి ఇస్తే వంద మంది అసంతృప్తికి గుర వుతారు. ఆ పరిస్థితిని తప్పించుకోవటానికే ఇన్నేళ్లూ పదవుల భర్తీపై కాంగ్రెస్ కాలయాపన చేస్తూ వస్తోంది. ఇప్పుడు సర్కారు మైనారిటీలో పడటంతో పీఆర్‌పీ నేతలను మచ్చిక చేసుకోవటానికి పదవులు భర్తీ చేయాల్సిన అనివార్య పరిస్థితులు కాంగ్రెస్‌ను మరింత ఇరకాటంలో పడేసిందని సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి