జగన్ కి ఒక విధంగా అవిశ్వాస తీర్మానం కొంత ఎదురుదెబ్బ గానే చెప్పవచ్చు. జగన్ కి కలిసొచ్చిన అంశం తను నమ్ముకొన్న MLA లు తనకు అనుకూలంగానే ఉండటం. టిడిపి మొదటి నుండి రైతు సమస్యలు మీద కంటే జగన్ ని ఇరకాటంలో పెట్టడానికే అవిశ్వాసం పెట్టినట్లు అటు రాజకీయ వర్గాల్లో ఇటు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కావడం వల్ల జగన్ రాజకీయంగా ఎదురు దెబ్బ తగిలిన సామాన్య ప్రజానీకంలో అంత వ్యతిరేకత రాకపోవచ్చు. జగన్ దెబ్బ కొట్టడానికే అవిశ్వాసం పెడుతున్నట్లు టిడిపి మీడియాలో నే రావడం జగన్ కి కలిసివచ్చే అంశం. జగన్ ప్రబుత్వాన్ని పడగొట్టడం అసాద్యం అని తనకు బాగా తెలుసు .ఎందుకంటే జగన్ 200 కోట్లు ఖర్చు పెట్టి 25 మంది MLA లు ను కొన్న టిడిపి లోని 20 మంది కాంగ్రెస్ కి అనుకూలంగా ఓటు వేసిన ఆశ్చర్య పోవలిసిన అవసరం లేదు .ఎందుకంటే టి డి పి ఉన్నపళంగా ఎన్నికలు కు పొతే 40 సీట్లు రాని పరిస్థితి లో ఆ పార్టీ ఉంది...జగన్ పడగొట్టడం అసాద్యం.అటు ఈనాడు ఆంధ్రజ్యోతి లు కాంగ్రెస్ MLA లు వెళ్ళకుండా బారి స్థాయిలో కథనాలు ఇచ్చాయి. జగన్ ఈ విషయం ముందే తెలియనంత అమాయకుడు కాదు కాని ఇప్పుడు వెనక్కి వెళ్తే విశ్వసనీయత దెబ్బ తింటుందని ముందుకు వెళ్ళాడు ..ఏది ఏమైనా కాంగ్రెస్ టిడిపి అవిశ్వాస రాజకీయ పద్మవ్యూహం లో ఇరికించి దెబ్బ కొట్టారు అనే చెప్పవచ్చు ..ఇది కాంగ్రెస్, టిడిపి లు కు బాగా కలిసివచ్చే అంశం..ఇక విప్ ని దిక్కరించిన MLA ల సబ్యత్వం రద్దు చేసే సాహసం చేయక పోవచ్చు..అలా చేస్తే రాష్ట్రంలో మినీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినంత పని అవుతుంది ..అందులో గెలవడం కిరణ్ కి అసాద్యం అనే చెప్పవచ్చు దీంతో తన పదవికే ఎసరు రావచ్చు..అందుకే అంత సాహసం చేయకపోవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి