7, డిసెంబర్ 2011, బుధవారం

రామోజీ పిటిషన్‌పై ముగిసింది, బాబు పిటిషన్‌పై రేపటికి

రామోజీ రావు దాఖలు చేసిన వెకేట్ పిటిషన్‌పై హైకోర్టులు బుధవారం వాదనలు ముగిశాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి దాఖలు చేసిన వెకేట్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. తమపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలతో ప్రాథమిక విచారణకు జారీ చేసిన ఆదేశాలను నిలుపు చేయాలని కోరుతూ వారిద్దరు హైకోర్టులో వెకేట్ పిటిషన్లు దాఖలు చేశారు. తమ వాదనలు వినకుండా, తమకు నోటీసులు ఇవ్వకుండా ప్రాథమిక విచారణకు ఆదేశాలు ఇవ్వడం పట్ల చంద్రబాబు తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ఆరోపణలు వచ్చినప్పుడు ప్రాథమిక విచారణకు ఆదేశిస్తే తప్పేమిటని న్యాయమూర్తి అడిగారు.

 

తమకు సిబిఐ నోటీసులు అందాయని, 2007 నుంచి వార్షిక నివేదికలను, బ్యాలెన్స్ షీట్లను, లాభనష్టాల లెక్కలను అందజేయాలని సిబిఐ నోటీసు జారీ చేసినట్లు రామోజీ తరఫు న్యాయవాది చెప్పారు. విజయమ్మ కుమారుడు వైయస్ జగన్‌పై సిబిఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ దురుద్దేశ్యంతోనే తమపై ఆమె పిటిషన్ దాఖలు చేశారని ఆయన వాదించారు. ప్రాథమిక విచారణ లేకుండా సమాచార సేకరణ ఎలా జరుగుతుందని కోర్టు ప్రశ్నించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి