7, డిసెంబర్ 2011, బుధవారం

రెచ్చగొట్టిన ఫ్లెక్సీ ...జూ ఎన్టీఆర్, పవన్ ఫ్యాన్స్ ఫైట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య వార్ నెలకొంది. దీంతో పోలీసులు రంగం ప్రవేశ చేసి పరిస్థితి అదుపులోకి తేవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.... నల్లగొండ జిల్లా కోదాడ లోని వెంకటేశ్వర థియేటర్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. థియేటర్ వద్ద పవన్ అభిమానులు ''తాతల నాటి చరిత్ర చెప్పుకునే ఆలోచన మాది కాదని, చరిత్ర సృష్టించే చరిత్రలే భావితరాలకు భగవద్గీత'' అంటూ ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

 

దీనిపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అభ్యంతరం తెలిపారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఫ్లెక్సీని వెంటనే తొలగించాలని నిరసన తెలిపారు. దీంతో ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం నెలకొంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి