7, డిసెంబర్ 2011, బుధవారం

అవిశ్వాసాన్ని రాజకీయం చేశారు: జగన్

                                                                                           

విశ్వసనీయత, విలువలను సమాధి చేసి.. రైతుల కోసం ప్రవేశపెట్టామని చెప్పి అవిశ్వాసాన్నిరాజకీయం చేశారని కాంగ్రెస్,టీడీపీ పార్టీలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఓదార్పుయాత్రను బుధవారం రోజున గుంటూరు జిల్లాలో జగన్పునః ప్రారంభించారు.

 

మాచవరంలో ఏర్పాటు చేసిన సభలో జగన్ మాట్లాడుతూ.. అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడిన మాటలన్ని అబద్దాలేనని ఆయన అన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఏ విద్యార్థికి కూడా ఫీజు రీఎంబర్స్‌మెంట్ చేయలేదని జగన్ ఆరోపించారు.

 

2009-10 సంవత్సరంలో 3200 కోట్లు కేటాయించి, 900 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని పభుత్వంతీరును ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. 2011-12 సంవత్సరంలో 2900 కోట్లు కేటాయించారని... ఈ ఆర్ధిక సంవత్సరానికి కేటాయించిన నిధులతో బకాయిలు చెల్లించి ఫీజు రీఎంబర్స్‌మెంట్ను అమలు చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని జగన్ అన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి