‘దూకుడు’తో తన తిరుగులేని ఇమేజ్‌ని మళ్లీ సొంతం చేసుకున్న మహేష్‌బాబుతో ‘బిజినెస్‌మేన్’ చిత్రంలో పాట పాడించి అందరి దృష్టినీ ఇప్పుడు తనవైపు ఆకర్షిస్తున్నారు తమన్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆర్‌ఆర్ మూవీమేకర్స్ అధినేత వెంకట్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఓ థీమ్ సాంగ్‌ని కావాలని పట్టుబట్టి మహేష్‌చేత తమన్ పాడించారు.
ఈ పాటలో కొన్ని డైలాగులు కూడా ఉంటాయట. ఈ డైలాగులను మహేష్ అద్భుతంగా పలికారని, సూపర్‌స్టార్ ప్రిన్స్ మహేష్‌బాబు రాక్ చేశారని కూడా తమన్ అన్నారు. ఈ పాటకు ఇటీవల తమిళంలో ధనుష్ పాడిన ‘కొలవెరి’ పాటకు ఆలోచనలో కానీ, అమలులో కానీ ఎటువంటి పోలిక లేదని తమన్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ నెల 22న ఈ చిత్రం ఆడియో విడుదల కానుంది. కచ్చితంగా ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తమన్ పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి