6, డిసెంబర్ 2011, మంగళవారం

కిరణ్ చూపంత కేబినెట్ విస్తరణ పైన.........!!!!!!!?



సొంత టీమ్‌ కోసం యత్నాలు


 కాంగ్రెస్‌ అధిష్టానం ఇక రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కన్నేసింది. తెలంగాణ ఉద్యమాలు కొంత వరకు శాంతించడం, అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేపట్టారు. అధిష్టానం నుండి గ్రీన్‌ సిగల్‌ పొందేందుకు ఆయన వడివడిగా అడుగులు వేస్తున్నారు. కీలకమైన విద్యుత్‌, వ్యవసాయ తదితర శాఖలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు, నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కడప జిల్లాకు చెందిన వైఎస్‌. వివేకానందరెడ్డి రాజీనామాలతో మంత్రివర్గ బెర్త్‌లు నింపాల్సి ఉంది. గత ఏడాది కాలంగా ముఖ్యమంత్రి మంత్రి వర్గాన్ని ఎలాంటి మార్పులు, చేర్పులు చేయలేదు. పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని ఆయన చాలాకాలంగా యోచిస్తున్నారు. దీనికి అధిష్టానం ఆమోదముద్ర లభించాల్సి ఉంది. కేబినెట్‌పై తన ముద్ర వుండేలా ముఖ్యమంత్రి ప్రస్తుతం పావులు కదుపుతున్నారు. ధర్మాన ప్రసాదరావు, పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్‌, వట్టి వసంతకుమార్‌ తదితర మంత్రులు తమతమ శాఖల పట్ల అసంతృ ప్తితో వున్నారు.ఉపముఖ్య మంత్రి దామోదర రాజనర్సింహ హోంమంత్రిత్వ శాఖ కావాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. పిసిసి అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ వైఖరి ముఖ్య మంత్రికి మింగుడు పడటం లేదు. ఒకరికి ఒకే పదవి వుండాలనే నియమాన్ని ఆయన అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి బొత్సను గాంధీభవన్‌కే పరిమితం చేయాలని యోచిస్తు న్నారు. అయితే బొత్స సత్యనారాయణ తన సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారు. పిఆర్పీ అధ్యక్షుడు చిరంజీవితో ఆయన చాలాకాలంగా కలిసి కట్టుగా ఉంటు న్నారు. కాంగ్రెస్‌లో పిఆర్పీ విలీనం తరువాత ఆ పార్టీకి మూడు మంత్రి పదవులు కట్టబెట్టాలని అధి ష్టానం యోచిస్తోంది. ఎమ్మెల్సీ సి.రామ చంద్రయ్య, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస రావు, వంగ గీత, కన్నబాబులు మంత్రి పదవుల కోసం తమ తమ యత్నాలను జోరుగా సాగిస్తున్నారు. కేంద్ర మంత్రి పదవిని అందిస్తామని ఇప్పటికే పార్టీ అధిష్టానం చిరంజీవికి హామీఇచ్చిన విషయం తెలిసిందే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి