* ఆరుచోట్ల పోటీకి టీఆర్‌ఎస్ సిద్ధం
* ఢిల్లీకి సత్తా చాటాలన్న పట్టుదల
* వెంటాడుతున్న 2008 ఫలితాలు
తెలంగాణాలో ఏ ఎన్నిక వచ్చినా విజయం తమదేనని ధీమాగా ఉన్న కేసీఆర్‌కు ఈ ఉప ఎన్నికలు అగ్నిపరీక్షే. ఏడు నియోజకవర్గాలకు గాను నాగర్‌కర్నూలు మినహా ఆరుచోట్ల టీఆర్‌ఎస్ పోటీకి దిగుతోంది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీలో ఆశావహమైన వాతావరణం లేని పరిస్థితుల్లో తన ప్రభావాన్ని ఆయన చాటుకోవాల్సి ఉంది. ఈ మినీ సమరం నాటికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణా అంశంలో తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదు.
కాంగ్రెస్,టీడీపీలకు చెందిన ఎమ్మెల్యేల రాజీనామాలతోనే ప్రధానంగా ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో టీఆర్‌ఎస్ భారీ విజయాలు సాధిస్తే మరిన్ని ఉప ఎన్నికలకు దారితీసే అవకాశం కూడా ఉంది. ఒక వేళ మిశ్రమ ఫలితాలే వస్తే కేసీఆర్‌కు ఇబ్బందులు తప్పవు. 2008లో 16 మందితో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్ళినప్పడు కొంత ప్రతికూల వాతావరణం ఎదురయింది. ఈసారి ఆపరిస్థితి ఉండదని ఆయన నమ్ముతున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి