కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు ఓటేసి, ప్రభుత్వాన్ని బలపరచడంపై ఆ విధంగా అన్నారు. విలువల గురించి మాట్లాడే వైయస్ జగన్ వంటివారు ఆలోచించాలని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అధికారాన్ని కాపాడుకునేందుకు శాసనసభ్యులకు ప్యాకేజీలు ప్రకటించి ప్రలోభపెట్టారని ఆయన విమర్శించారు. దొడ్డి దారిన అధికారంలోకి రావాలనే కోరిక తమ పార్టీకి లేదని ఆయన అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో కొద్ది సీట్లతో ప్రభుత్వాన్ని కాపాడారని ఆయన చిరంజీవిని ఉద్దేశించి అన్నారు. తమ పార్టీ నుంచి ఒక్కరు పోతే ఐదుగురిని తయారు చేసుకుంటామని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రైతు పోరు బాట ద్వారా క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించామని, రైతు సమస్యలపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని తాము చెబుతూ వస్తున్నామని ఆయన చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీది రాజకీయ ఎజెండా అని ఆయన అన్నారు. నీతిమాలిన రాజకీయాలను తమ పార్టీ ప్రోత్సహించదని ఆయన అన్నారు. ఆరు నెలల క్రితం అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వాన్ని పడగొట్టి ఉండగలిగే వాళ్లమని జగన్ అనడాన్ని ఆయన తప్పు పట్టారు. వాళ్ల కోసం తాము అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కరవు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు తిరగకపోయినా తాము తిరిగి సమస్యలు తెలుసుకున్నామని ఆయన చెప్పారు.
రాజకీయాల్లో విలువలు ఉండాలని, ఆయారాం గయారాంలు తయారయ్యారని ఆయన అన్నారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఓదార్పునకు సంబంధించి మన సంప్రదాయంలో ఓ పద్ధతి ఉందని, అందుకు భిన్నంగా ఏళ్ల తరబడి జగన్ ఓదార్పు యాత్ర సాగుతోందని, అది రాజకీయ యాత్ర తప్ప ఓదార్పు యాత్ర కాదని ఆయన అన్నారు. అవినీతికి పాల్పడినా ప్రజలు తమను గౌరవిస్తారని అనుకుంటున్నారని ఆయన అన్నారు. కలలుగానే మిగిలిపోతాయని ఆయన అన్నారు. ప్రజారాజ్యం, మజ్లీస్ వల్లనే ప్రభుత్వం నిలబడిందని ఆయన అన్నారు. ఓదార్పు యాత్రకు అర్థం, హద్దూ లేదని ఆయన అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఓదార్పు యాత్ర చేపట్టారని ఆయన అన్నారు. పదవి కోసమే చిరంజీవి కాంగ్రెసులో చేరారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసే కోదండరామ్‌కు తమ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు. సీల్డ్ కవర్‌లో వచ్చే పేర్లతో ముఖ్యమంత్రులు అయ్యే వారికి ప్రజాసమస్యలపై చిత్తశుద్ధి ఉండదని ఆయన అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అన్ని సీట్లలో పోటీ చేస్తామని ఆయన చెప్పారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి