బెస్ట్ సిటీగా విజయవాడ
పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) పద్ధతిలో రైతుల వద్ద భూమి సేకరించి, పేదలకు ఇళ్ల నిర్మాణం చేస్తున్న విజయవాడ నగరానికి జాతీయస్థాయిలో 'ఉత్తమ నగరం' అవార్డును కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది. ఈనెల 13న ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ అవార్డును కమిషనర్ జి.రవిబాబుకు అందించనున్నారు. రైతుల వద్ద సేకరించిన 226.56 ఎకరాల్లో 60% భూమిని కార్పొరేషన్ అభివృద్ధి చేసి రైతులకు ఇళ్ల స్థలాలుగా కేటాయించింది. మిగిలిన 40%భూమిలో జేఎన్‌ఎన్యూఆర్‌ఎం నిధులతో పేదల కోసం 8,800 ఇళ్ల నిర్మాణం చేపట్టింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి