13, డిసెంబర్ 2011, మంగళవారం

ఇది బొత్స టెక్నిక్ ...

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్టైలే వేరు. ఆయన జనాన్ని ఆకట్టుకోవడంలోను, పార్టీలో ఎమ్మెల్యేలను ఆకర్షించడంలోను తనదైన శైలిలో వ్యవహరిస్తుంటారు. ఇటీవల ఒక ఎమ్మెల్యే తన అనుభవాన్ని తన సన్నిహితులకు ఈ విషయాన్ని వివరించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితుడైన ఆ ఎమ్మెల్యే ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందినవారు. ఆయన ఏదో పని ఉండి బొత్సను కలిశారు. మొదటిసారి కలిసినప్పుడు ఆయన చేయి పట్టుకుని తన సీటు వద్దకు తీసుకువెళ్లి కూర్చోబెట్టి మాట్లాడారు. ఆ తర్వాత మరి కొద్ది రోజులకు మరో అవసరంపై ఆయన మళ్లీ బొత్సను కలిశారు.ఈ సారి బొత్స ఏకంగా ఆ ఎమ్మెల్యేని స్వయంగా డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకువెళ్లి వెండి పళ్లెంలో భోజనం పెట్టించి పంపించారట. ఇంత ఆత్మీయంగా వ్యవహరిస్తే ఎవరైనా బొత్స వైపు ఆకర్షితులు కాకుండా ఎలా ఉంటారని ఆ ఎమ్మెల్యే అంటున్నారు. ఇక జనాన్ని గురించి అదే తరహాలో డీల్ చేస్తుంటారట. తన నియోజకవర్గం నుంచి వచ్చే వారిని ఎందుకు వచ్చావు? ఏ మి కావాలి? అని అడిగి మరీ తెలుసుకుని వెంటనే సంబంధింత అదికారికి ఫోన్ చేసి అది కష్టమైన పని అయినా చేయాల్సిందేనని , ప్రజల ముందునుంచే చెబుతుంటారు. దాంతో బొత్స తమకోసం చేసిన కృషికి వారు దిల్ అయిపోతారట. ఇది బొత్స టెక్నిక్ ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి