ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, జన లోక్‌పాల్ కోసం ఉద్యమిస్తున్న అన్నా హజారే ఈ నెల 19న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. గాంధీ కింగ్ ఫౌండేషన్ చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి హజారే హైదరాబాద్ వస్తున్నట్టు ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ప్రసాద్ గొల్లనపల్లి తెలిపారు. హైదరాబాద్ పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ప్రజలతో ముచ్చటించడానికి అన్నా హజారే అంగీకరించినట్టు తెలిపారు. అన్నా హజారేతో పాటు అరవింద్ కేజ్రీవాల్ కూడా హైదరాబాద్‌లో పర్యటిస్తారని, 19న జరిగే సమావేశంలో ప్రసంగిస్తారని తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టిన తరువాత తొలిసారిగా హైదరాబాద్‌లో పర్యటిస్తున్న అన్నా హజారే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గాంధీ కింగ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ప్రసాద్ కోరారు.
13, డిసెంబర్ 2011, మంగళవారం
హైదరాబాద్ కు అన్న హజారే
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి