పార్టీ విప్‑ని ధిక్కరించి శాసనసభలో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన శాసనసభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‑కు ఫిర్యాదు చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. మంత్రులు, ఎంపిలు, సీనియర్లతో చర్చించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ రాష్ట్రవ్యవహారా ఇన్‑ఛార్జి గులాంనబీ ఆజాద్‑లను కలిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ విప్‑ని ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన సభ్యులను అనర్హులుగా ప్రకటించమని సిఎల్‑పి తరపున స్పీకర్‑కు లేఖ అందజేస్తారని చెప్పారు. సమావేశానికి హాజరుకానివారిని వివరణ అడుగుతామన్నారు.
పిఆర్‑పికి సంబంధించి అడిగిన ప్రశ్నలకు ఆ పార్టీనే చూసుకుంటుందని చెప్పారు. తమ పార్టీ అధిష్టానంతో ఏం మాట్లాడామో తాము చెప్పకూడదన్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, అభివృద్ధి పథకాల గురించి చర్చించినట్లు తెలిపారు.
తెలంగాణపై రాష్ట్ర స్థాయిలో సంప్రదింపులు ప్రక్రియ పూర్తి అయిందని సిఎం తెలిపారు. తెలంగాణపై అధిష్టానమే ఒక ప్రకటన చేస్తుందన్నారు. సిఎం విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఉన్న కొందరు జై తెలంగాణ అని నినాదాలు చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి