DMK అధ్యక్షుడు కరుణానిధి UPA ప్రభుత్వంపై డైరెక్ట్ ఎటాక్ చేశారు. ముళ్లపెరియార్ డ్యాం విషయమై తమిళనాడు, కేరళ మధ్య ఉద్ధృతమవుతున్న వివాదాన్ని పరిష్కరించడానికి కేంద్రం చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని అంశాలపై ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుంటోందని పేరు పడ్డ కేంద్రం.. ఈ విషయంలో మాత్రం లేట్ చేయోద్దని కరుణ సూచించారు. ఒకవేళ లేటైతే పర్యవసానాలు దారుణంగా ఉంటాయని కరుణ హెచ్చరించారు.
ముళ్లపెరియార్ డ్యామ్‌లో నీటి మట్టం పెంచాలన్న సుప్రీం కోర్టు తీర్పును పాటించాలని కేరళ సర్కారుకు కేంద్రం నచ్చజెప్పాలని కోరుతూ తమిళనాడులో డిఎంకె ఒక రోజు నిరాహార దీక్ష నిర్వహించింది. డ్యామ్ బద్దలు కావచ్చునంటూ జనంలో భయం పుట్టిస్తున్న కేరళ రాజకీయ నాయకులపై కలైంగర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి