జగన్ అవిశ్వాసం ఫై దూకుడు పెంచాడు .ఇప్పటికే అవిశ్వాసం ఫై తన వైకరి చెప్పిన జగన్ సత్తా చాటి టి డి పి కాంగ్రెస్ కి జలక్ ఇవ్వడానికి సిద్దం అయ్యినట్టు సమాచారం శాసనసభలో అవిశ్వాస తీర్మానం వచ్చే పక్షంలో తన వర్గం ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండడం కోసం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా ఓదార్పుయాత్రను రేపటి నుంచి వాయిదా వేసుకుని హైదరాబాద్ వస్తున్నారు. దానికి ముందుగా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను కుమారుడి వివాహానికి వెళ్లి హైదరాబాద్ చేరుకోవచ్చని చెబుతున్నారు. అవిశ్వాస తీర్మానానికి జగన్ పార్టీ సీరియస్ నెస్ ఇవ్వడం లేదని, కాంగ్రెస్ తో రాజీ పడినందునే ఇలా చేస్తున్నదని టిడిపి విమర్శలు చేస్తున్న నేపధ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి