అవిశ్వాస తీర్మానం రోజు అసెంబ్లీలో జగన్ కు 18 మంది mla లు మద్దతు తెలపడం తో
కాంగ్రెస్ టిడిపి లు షాక్ తిన్నాయి.వాళ్ళ అంచనా ప్రకారం జగన్ కి మద్దతు ఇచ్చే
సంఖ్య ఐదు ఆరుగురు మించి ఉండదని అంచనా వేసుకొన్నారు. తెలుగుదేశం ముఖ్యనేత
ఒకరైతే జగన్ బలం ఐదారుకన్నా ఉండదని తనకు సమాచారం వచ్చిందని అన్నారట. అది కూడా
వైఎస్ విజయమ్మతోపాటు, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కడప
జిల్లాకు చెందిన ఒకరిద్దరు మాత్రమే మిగులుతారని వారు భావించారు. కాంగ్రెస్
ముఖ్యనేతలు సైతం ఇదే మాదిరి పదిలోపే ఉంటుందని అనుకున్నారు .కెవిపి మాత్రం జగన్
పదిహేడు మంది వరకు మద్దతు తెలుపుతారు అని చెప్పినట్టు సమాచారం. పద్దెనిమిది
మంది ఎమ్మెల్యేలు జగన్ కు మద్దతు ఇవ్వడం కచ్చితంగా తమను ఆలోచింపచేసేదే అయిందని
ఆయన అన్నారు. అలా గే కాంగ్రెస్ నేతలు సైతం ఈ పరిణామానికి
ఉలిక్కిపడ్డారు.అందువల్లనే ఇప్పుడు వారిపై అనర్హత వేటు వేయడానికి వెనుకా,ముందు
అయ్యే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. ధైర్యంగా కాంగ్రెస్ నేతలు
తాము విప్ ఉల్లంఘించినవారిపై అనర్హత వేటు వేయబోతున్నామని ధైర్యంగా
చెప్పలేకపోతున్నారని చెబుతున్నారు. ఉప ఎన్నికలు వస్తే ఎదురయ్యే ఇబ్బందులను
దృష్టిలో ఉంచుకునే వారు ఇలా వ్యవహరిస్తున్నారని భావిస్తున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి